ఐక్యరాజ్యసమితి 76వ జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఐరాసకు కూడా మోదీ చురకలంటించారు. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పు చెందాలన్నారు. ఈ సందర్భంగా చాణక్యుడు వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు.
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. అదే వైఫల్యానికి దారి తీస్తుంది. ప్రస్తుత ప్రపంచానికి తగ్గుట్లు ఐరాస ఉండాలనుకుంటే తమ విశ్వసనీయత, సమర్థతను మెరుగుపర్చుకోవాల్సిందే. వాతావరణ మార్పులు, కరోనా సంక్షోభ సమయంలో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థపై పలు ప్రశ్నలు తలెత్తాయి. కరోనా కారణంగా డబ్ల్యూహెచ్ఓ పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా డబ్ల్యూహెచ్ఓను చైనా చేతిలో కీలుబొమ్మ అని వ్యాఖ్యానించారు. పలు దేశాల్లో జరుగుతోన్న అంతర్యుద్ధాలు, పరోక్ష యుద్ధాలు, ఉగ్రవాదం, అఫ్గానిస్థాన్‌లో తాజా పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నల గంభీరత మరింత పెరుగుతోంది. కరోనా పుట్టుక, సులభతర వాణిజ్య ర్యాంకింగులు, ప్రపంచస్ఖాయి సంస్థల పనితీరులో లోపం ఇవన్నీ.. ఎన్నో దశాబ్దాలుగా మీరు నిర్మించుకున్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఐరాసను నిరంతరం బలోపేతం చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలు, విలువలను కాపాడగలిగిన వాళ్లమవుతాం. - ప్రధాని నరేంద్ర మోదీ
భారత అభివృద్ధి..
భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని మోదీ వ్యాఖ్యానించారు. భారత్‌లో సంస్కరణలు తీసుకొస్తే ప్రపంచం రూపాంతరం చెందుతుందన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇది కరోనా మహమ్మారి మనకు నేర్పించింది. అందుకే గ్లోబల్ వేల్యూ చైన్ విస్తరణ జరగడం ముఖ్యం. దీని ఆధారంగానే మా 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' రూపొందింది. 'అంత్యోదయ' అనే సూత్రంతో భారత్ ముందుకు సాగుతోంది. అభివృద్ధి అనేది సమ్మిళితంగా, సర్వవ్యాప్తంగా ఉండాలి. - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read:Sneha Dubey: ఇమ్రాన్‌కు దిమ్మతిరిగే షాక్.. తెల్లబోయిన పాక్.. ఆమె ఎవరో తెలుసా?