ఐక్యరాజ్యసమితి 76వ జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యంపై ప్రశంసలు కురింపించారు. అఫ్గానిస్థాన్ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో ప్రజాస్వామ్యానికిి చాలా విలువ ఉంది. ఓ సాధారణ ఛాయ్‌వాలా దేశానికి ప్రధాని స్థాయికి ఎదిగాడంటే దానికి ప్రజాస్వామ్యమే కారణం. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయ్యే వేళ మా దేశ విద్యార్థులు తయారు చేసిన 75 ఉపగ్రహాలను నింగికి చేరనున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచం ఓ మహమ్మారి వల్ల తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఇది గతంలో ఎన్నడూ చూడని విపత్తు. ఈ మహమ్మారిపై ఉమ్మడి పోరు చేసి విజయం సాధిద్దాం. వ్యాక్సిన్ సరఫరాలో భారత్ ముందుంటుంది. ప్రపంచస్థాయి సంస్థలు భారత్‌లో వ్యాక్సిన్‌లు తయారు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. - ప్రధాని నరేంద్ర మోదీ
అఫ్గానిస్థాన్‌పై..
అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మోదీ అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అఫ్గాన్ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయం కాకూడదన్నారు.
అఫ్గాన్ గడ్డ ఉగ్రవాదానికి అడ్డా కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంతర ఉగ్రవాదం విస్తరించకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అఫ్గాన్‌లో బలహీన పరిణామాలను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనుకునే దేశాలతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అఫ్గాన్ ప్రజలు, మహిళలు, చిన్నారులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని ఆదుకోవాలి. - ప్రధాని నరేంద్ర మోదీ
పాకిస్థాన్‌కు చురకులు..
ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించాలని చూస్తోన్న దేశాలు ఓ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచంతో పాటు పెంచి పోషించే దేశాలకు కూడా ఈ ఉగ్రవాదం పెను ముప్పే. - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read:Sneha Dubey: ఇమ్రాన్‌కు దిమ్మతిరిగే షాక్.. తెల్లబోయిన పాక్.. ఆమె ఎవరో తెలుసా?