ఏపీలో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గడంలేదు. గడిటిన 24 గంటల్లో కొత్తగా 55,307 నమూనాలు పరీక్షించగా 1,167 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2045657కి చేరింది. కొత్తగా ఏడుగురు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 14125కి చేరింది. 24 గంటల వ్యవధిలో1,487 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,18,324కి చేరింది.
Also Read: ఇంటి వద్దే కరోనా వ్యాక్సిన్... త్వరలో పూర్తి కార్యాచరణ... కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
తూ.గో, చిత్తూరులో తగ్గని ఉద్ధృతి
ప్రస్తుతం రాష్ట్రంలో 13,208 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,80,36,099 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు రాష్టర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల ఇవాళ కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో 224, చిత్తూరు జిల్లాలో 167 మందికి వైరస్ సోకింది.
Also Read: "పీఎం కేర్స్" ప్రభుత్వ నిధి కాదా ? విరాళాలు, ఖర్చులు ఎందుకంత రహస్యం !?
Also Read: కరోనా మరణాలకు పరిహారం ! లెక్కల్లో వేయని వారి కుటుంబాలు అన్యాయమైపోయినట్లేనా..!?
దేశంలో కరోనా కేసులు
దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 28,046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.78 శాతంగా ఉంది. నిన్న కరోనాతో 290 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,46,658కి పెరిగింది. దేశంలోని ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 3,01,442 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 3,28,76,319 మంది కోలుకున్నారు. కేరళలో గడిచిన శుక్రవారం 17,983 కరోనా కేసులు నమోదు కాగా, 127 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం దేశ వ్యాప్తంగా 71,04,051 డోసుల కరోనా వాక్సిన్లు వేశారు. ఇప్పటి వరకు మొత్తం 84,89,29,160 డోసుల టీకాలు పంపిణీ చేశారు.
Also Read: కరోనా మరణాలకు పరిహారం ! లెక్కల్లో వేయని వారి కుటుంబాలు అన్యాయమైపోయినట్లేనా..!?