ఆన్‌లైన్ వేదికల్లో అపరిచితులను తేలిగ్గా నమ్మితే ఎంతటి మోసం జరుగుతుందో చాటే మరో ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు యువతిని భౌతికంగా ఉపయోగించుకొని తర్వాత ఆమెకు ఝలక్ ఇచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి అతను చెప్పినట్లు చేసింది. అయినా వదలకపోవడంతో చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం పూర్తిగా వెలుగులోకి వచ్చింది.


Also Read: 20 మంది పురుషులు.. ముగ్గురు మహిళలతో.. లారీలు అడ్డుగా పెట్టి ఘోరం, బహిరంగంగానే..


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ఓ యువతి ప్రొఫైల్ చూసిన యువకుడు.. బాగా నచ్చావని.. నచ్చితే పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. అనంతరం వారు ఏకాంతంగా గడిపిన సన్నివేశాలు నెట్టింట్లో కనిపించడంతో యువతి కంగుతిన్నది. హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌‌కు చెందిన యువతి.. మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పెళ్లి కోసం తన వివరాలు రిజిస్టర్ చేసుకుంది. ఓ రోజు ఆమెకు ఒక సెల్ ఫోన్ నెంబరు నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు సుభాష్ అని, ఫలానా ఉద్యోగం చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. 


Also Read: యూట్యూబ్ చూసి దొంగనోట్ల ప్రింటింగ్.. చికెన్ పకోడితో సీక్రెట్ బయటకి..


మ్యాట్రిమోనీ సైట్‌లో మీ ప్రొఫైల్‌ తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. తర్వాత కొద్ది రోజులు ఇద్దరూ తరచూ ఫోన్ ద్వారానే మాట్లాడుకునేవారు. ఓ రోజు కలుద్దామని యువతిని మాదాపూర్‌కు ఆహ్వానించాడు. ఇద్దరు ఏప్రిల్‌ 27న ఓ రెస్టారెంట్‌లో కలిశారు. భోజనం తర్వాత తన గదికి కూడా తీసుకెళ్లాడు. ఆమెతో తన కోరిక తీర్చుకున్నాడు. ఏకాంతంగా కలిసిన సమయంలో నిందితుడు వీడియోలు, ఫొటోలు తీశాడు. అయితే, డబ్బు ఇవ్వాలని లేదంటే వాటిని నెట్టింట్లో అప్ లోడ్ చేస్తానంటూ నిందితుడు బెదిరించాడు. చేసేది లేక అతను అడిగిన డబ్బును ఇచ్చింది. అయినా, కొన్ని రోజుల తర్వాత అవి నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. కంగుతిన్న బాధితురాలు సుభాష్‌కు కాల్‌ చేసింది. తనకు ఇంకా డబ్బు ఇవ్వాలని.. లేదంటే వాటిని ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని నిందితుడు బెదిరించాడు. డబ్బులిచ్చినా డిలీట్‌ చేయకపోవడంతో చివరికి చేసేది లేక యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.


Also Read: 8 నెలలుగా గ్యాంగ్ రేప్.. శిశువుకు జన్మనిచ్చిన బాలిక.. బిడ్డను ఏం చేశారంటే..


Also Read: యూట్యూబ్‌లో చూస్తూ సొంతగా అబార్షన్ చేసుకున్న రేప్ బాధితురాలు, ప్రియుడి సలహాతోనే.. చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి