ఇడియట్, పోకిరి, దేశముదురు, నేనింతే, లోఫర్, టెంపర్, ఎక్ నిరంజన్...ఇవన్నీ వరుసగా విని తిట్లనుకునేరు పూరీ జగన్నాథ్ మూవీ టైటిల్స్ అండోయ్. టైటిల్ విషయంలో మాత్రమే కాదు కథ, కథనంలోనూ పూరిది డిఫరెంట్ స్టైల్. ప్రేక్షకులకు వినోదాన్ని అందించే చిత్రాలను అతి తక్కువ సమయంలో తెరకెక్కించి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్టందుకోవడమే పూరీ స్టైల్.
కమర్షియల్ సినిమాకి త‌న‌దైన మార్క్‌, మీనింగ్ ఇచ్చిన ఏకైక దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్‌. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనదైన డైలాగ్‌లతో మాస్‌ ప్రేక్షకులను కట్టిపడేయగల నేర్పరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ' బద్రి' తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోలందరితోనూ మూవీస్ తెరకెక్కించాడు పూరీ. ముఖ్యంగా రవితేజ-పూరీ కాంబినేషన్ అదుర్స్ అని చెప్పాలి. ఇట్లు శ్రావణి సుబ్రణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి తిరుగులేని విజయాలను అందుకోవడమే కాదు రవితేజను కెరీర్ స్పీడ్ పెంచాయి కూడా.  సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన 'పోకిరి' తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత 'చిరుత,' 'దేశముదురు'  తో పూరీ మంచి సక్సెస్ అందుకున్నాడు. మధ్య మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురై పూరీ కెరీర్ కాస్త నెమ్మదించినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. 'బుజ్జిగాడు', 'ఏక్ నిరంజన్',  'బిజినెస్ మేన్', 'ఇద్దరమ్మాయిలతో' ,' టెంపర్', 'ఇజం'.. ఇలా యంగ్ హీరోలందరితోనూ వరుస మూవీస్ తెరకెక్కించాడు పూరీ. మధ్యలో కొన్ని పరాజయాలతో పూరి కెరీర్ కాస్త నెమ్మదించనా మళ్లీ 'ఇస్మార్ట్ శంకర్' తో దూసుకొచ్చాడు.






ప్రస్తుతం  విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'లైగ‌ర్' సినిమా తెర‌కెక్కిస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమాకు పూరీతో పాటూ  ఛార్మి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ మ‌రో నిర్మాత‌. పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది. అయితే పూరీ బర్త్ డే సందర్భంగా డిఫరెంట్ గా శుభాకాంక్షలు చెప్పింది చార్మీ. ‘‘నాకెంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు ధ‌న్య‌వాదాలు. మీరు గ‌ర్వ‌ప‌డేలా ఆ న‌మ్మ‌కాన్ని నేను ఎప్పుడూ నిల‌బెట్టుకుంటూనే ఉన్నాను’’ అంటూ చేతిలో మందుగ్లాసు ప‌ట్టుకుని త‌న ముందుకు కుర్చిలో కూర్చున్న పూరికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. 


Also Read: సిగ్గుతో తలదించుకున్న రవి.. తట్టుకోలేక ఏడ్చేసిన ప్రియా.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..


Also Read: నటుడిగా 14 ఏళ్లు.. రామ్ చరణ్ కి ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్..


Also Read: అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేస్తే.. మీరేం చేశారు..? పవన్ పై పోసాని వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి