భారత్‌ మార్కెట్‌లో గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న పసిడి ధరలు నేడు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు (సెప్టెంబరు 28) 10 గ్రాములకు (తులం) రూ.46,240గా ఉంది. నిన్నటితో పోలిస్తే గ్రాముకు రూ.4 మేర అధికమైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.45,280గా నమోదైంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కూడా పసిడి ధర ఎగబాకింది. 


వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. భారత మార్కెట్‌లో కిలో వెండి రూ.60,250గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.350 వరకు ధర పెరిగింది. ఇక హైదరాబాద్‌ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.64,400గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని  హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 28న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


Also Read: e-Shram Card: మీ జీతం 15 వేల కంటే తక్కువా? మీకో శుభవార్త.. ఈ ఒక్క పని ఫ్రీగా చేస్తే ఎన్నో లాభాలు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తులానికి రూ.160 మేర పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర 10 గ్రాములకు ప్రస్తుతం రూ.47,290 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.43,350గా ఉంది. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే కేజీకి రూ.300 మేర పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర కిలో రూ.64,400 పలికింది.


విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర సెప్టెంబరు 28న రూ.43,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,290గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,400గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,350 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,290గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో హైదరాబాద్, విజయవాడ మాదిరిగానే రూ.64,400 పలుకుతోంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
ముంబైలో సెప్టెంబర్ 28న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,280ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,280గా ఉంది. చెన్నైలో నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఇవాళ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,510 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,470గా ఉంది.


Also Read: RBL Bank Penalized: ఆర్‌బీఎల్ బ్యాంకుకు ఆర్‌బీఐ షాక్.. రూ.2 కోట్ల జరిమానా!


ఎగబాకిన ప్లాటినం ధరలు
నిన్నటితో పోలిస్తే హైదరాబాద్‌లో ప్లాటినం ధర కాస్త పెరిగింది. ఇవాళ గ్రాము ప్లాటినం ధర రూ.2,334గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ ధర గ్రాముకు ఏకంగా రూ.17 పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.23,340 గా ఉంది.  విశాఖపట్నంలో ప్లాటినం ధరలు ఒక్కసారిగా గ్రాముపై రూ.32 మేర పెరిగాయి. గ్రాము ప్లాటినం ధర రూ.2,349గా నమోదైంది. 


వివిధ అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.


Also Read: Horoscope Today: ఈ రాశుల వారికి బాధ్యతలు పెరుగుతాయి, వారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఏ రాశుల వారికి ఎలా ఉందంటే..


Also Read: Cyclone Gulab Live Updates: గులాబ్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి