ఆర్‌బీఎల్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ.2 కోట్ల మానిటరీ పెనాల్టీ విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంకు. డిపాజిట్, బోర్డు కూర్పు నియమాలను ఉల్లంఘించినందుకే ఈ భారీ జరిమానా విధించినట్లు సమాచారం. 


2016, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (డిపాజిట్లపై వడ్డీ రేటు) ఆదేశాలు, 1949 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, సెక్షన్ 10A లోని సబ్ సెక్షన్ 2 నిబంధన (బి)ను పాటించకపోవడంపై ఆర్‌బీఎల్ బ్యాంకుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.


2019, మార్చి 31 నాటికి బ్యాంక్ పర్యవేక్షణ మూల్యాంకనం (ఐఎస్ఈ)పై  ఆర్‌బీఐ తనిఖీ చేసింది. 


ISE 2019కి సంబంధించిన రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్, ఇన్‌స్పెక్షన్ నివేదికలు పరిశీలించగా ఆర్‌బీఎల్ బ్యాంకు ఆదేశాలను ఉల్లంఘించినట్లు తెలిసింది. ఆర్‌బీఎల్ బ్యాంకు చేసిన తప్పిదాన్ని ఆర్‌బీఐ స్పష్టంగా ప్రకటనలో తెలిపింది.


(i) కోఆపరేటివ్ బ్యాంకు పేరుతో ఐదు పొదుపు డిపాజిట్ ఖాతాలను తెరవడం.


(ii) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కూర్పునకు సంబంధించి చట్టంలోని సెక్షన్ 10A (2) (b) నిబంధనలను పాటించడంలో వైఫల్యం.


ఈ ఉల్లంఘనల కింద ఎందుకు పెనాల్టీ విధించకూడదో తెలియజేయమని ఆర్‌బీఐ.. సదరు బ్యాంకుకు నోటీసు జారీ చేసింది. బ్యాంక్ ప్రత్యుత్తరాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత ఈ మేరకు జరిమానా విధించింది.