Shilpa Shetty Divorce: భర్తతో విడాకులు.. స్పందించిన శిల్పాశెట్టి..

ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Continues below advertisement

ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కుంద్రా అరెస్ట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. చాలా కాలంగా ఈ విషయం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గానే రాజ్ కుంద్రా బెయిల్ పై ఇంటికి తిరిగొచ్చారు. ఇదిలా ఉండగా.. రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన వెంటనే శిల్పాశెట్టి వైవాహిక జీవితానికి సంబంధించిన పుకార్లు చెలరేగాయి. 

Continues below advertisement

Also Read: క్రేజీ అప్డేట్.. మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ ఫైట్..

వాటికి తగ్గట్లే అమ్మడు చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపాయి. సింగిల్ మదర్ గా కొనసాగే ధైర్యం, ఆర్ధిక స్తోమత తనకు ఉన్నాయంటూ శిల్పాశెట్టి గతంలో ప్రకటించింది. దీంతో ఆమె రాజ్ కుంద్రా నుంచి విడిపోతుందని అంతా అనుకున్నారు. ఈ మధ్యకాలంలో శిల్పాశెట్టి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లు కూడా అలానే ఉండడంతో ఈ వార్తలకు మరింత బలంచేకూరింది . అయితే రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి విడిపోవడం లేదని తెలుస్తోంది. 

తామిద్దరం ఎప్పటిలానే చాలా అన్యోన్యంగా కలిసి ఉంటున్నామని.. ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనల వలన తమ మధ్య అనుబంధం మరింత పెరిగిందని అంటోంది శిల్పాశెట్టి. అంతేకాదు.. తన భర్త నుంచి విడిపోయే ఆలోచన వలెనే ఆమె మరోసారి బాలీవుడ్ లో బిజీ అవ్వడం కోసం ప్రయత్నిస్తోందని వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేసింది శిల్పాశెట్టి. 

కొన్ని ఘటనలను మర్చిపోవాలంటే పనిలో పడిపోవాలని.. ప్రస్తుతం తను అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అవ్వడంతో శిల్పాశెట్టి కెరీర్ పై చాలా ఎఫెక్ట్ పైనుండి. ఆమె బ్రాండ్ వాల్యూ పడిపోయింది. దీంతో శిల్పాశెట్టి ఆర్థికంగా కూడా ఎఫెక్ట్ అయింది. అలా కోల్పోయిన తన బ్రాండ్ వాల్యూని తిరిగి పెంచుకునే పనిలో పడింది శిల్పాశెట్టి. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న రాజ్ కుంద్రా.. శిల్పాశెట్టితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

Also Read: 'మీ వెనుక గొర్రెలు కాదుకదా.. వాటి బొచ్చు కూడా రాదు.. అడివి మీ అబ్బ సొత్తేమ్ కాదు'

Also Read: ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..

Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్

Also Read: 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement
Sponsored Links by Taboola