'కొండపొలం' అనే నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ సినిమాను రూపొందించారు. దానికి కూడా 'కొండపొలం' అనే టైటిలే పెట్టారు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు అక్టోబర్ 8న సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
Also Read: ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..
ఇంటర్వ్యూ కోసం వెళ్లిన హీరోని.. 'గొర్లె కాపరుల కుటుంబం.. తల్లితండ్రులకు చదువు లేదు. ఏ కోచింగ్ సెంటర్ లో ట్రైన్ అయ్యారు' అని ప్రశ్నించగా.. 'అడివి సర్.. నల్లమల్ల అడివి' అంటూ హీరో బదులిచ్చే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ క్రమంలో చూపించిన అడివి సన్నివేశాలు, పులి గాండ్రించే సీన్స్ ఆకట్టుకున్నాయి. మందల మందల గొర్రెలున్న హీరో ఫ్యామిలీ, గొర్రెలకు నీళ్లు లేక వాటి కోసం 'కొండపొలం' వెళ్లాలని నిర్ణయించుకుంటారు. తన తండ్రితో పాటు హీరో కూడా కొండపొలానికి వెళ్తాడు.
'చదువుకున్న గొర్రె చదువుకోని గొర్రెతో మాటాడేది సూసినావా' అంటూ రకుల్.. హీరో గురించి చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. 'మందని ఇడిసిపెట్టి పోతే.. ఇక్కడోలే నవ్వుతారు.. 'కొండపొలం' వదిలేసి ఇంటికి పారిపోతే.. ఊరంతా నవ్వుతాది.. నేను ఉంటా నాయనా' అంటూ హీరో అమాయకంగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.
అనంతరం గొర్రెలను చంపి తినే పులి, గొర్రెల వెంటపడే దొంగల ముఠాకి సంబంధించిన సన్నివేశాలను చూపించారు. 'మీ వెనుక గొర్రెలు కాదుకదా.. వాటి బొచ్చు కూడా రాదు.. అడివి మీ అబ్బ సొత్తేమ్ కాదు.. పోండీ' అంటూ హీరో ఇచ్చే వార్నింగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ చివర్లో గొర్రెని తినే పులిని హీరో ఆవేశంగా చూసే సీన్ మరో హైలైట్ అనే చెప్పాలి. మొత్తానికి విజువల్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకుడు క్రిష్. మొత్తం టీజర్ ఒక ఎత్తయితే.. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read: 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి