కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ తెలుగులో మాత్రం ఏ స్టార్ హీరో అలాంటి సాహసం చేయలేదు. అలాంటిది ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓటీటీలోకి వస్తుందని రూమర్లు వినిపించాయి. పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'భీమ్లా నాయక్' సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారంటూ ఈరోజు సోషల్ మీడియాలో ఓ వార్తల్లోకి చక్కర్లు కొట్టింది.
Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్
మళయాలంలో భారీ సక్సెస్ అందుకున్న 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా కమర్షియల్ యాంగిల్ లో సినిమాను తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ రికార్డు మొత్తానికి అమ్మేశారు. మిగిలిన నాన్ థియేట్రికల్ హక్కుల కోసం డెబ్భై కోట్ల రేంజ్ లో బేరాలు జరుగుతున్నాయి. ఇది కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి రూ.80 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే రూ.170 కోట్ల బిజినెస్ జరుగుతుందన్నమాట.
అలాంటి సినిమాకి ఓటీటీ ఆఫర్ అదే రేంజ్ లో రావడంతో బేరాలు సాగుతున్నాయని.. సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని అన్నారు. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను థియేటర్లో మాత్రమే విడుదల చేస్తామని.. జనవరి 12, 2022కి సినిమా కచ్చితంగా విడుదలవుతుందని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనే వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు గ్లింప్స్ కు, ఒక పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నారు.
Also Read: 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్
Also Read: పవన్ కళ్యాణ్‌కు మోహన్ బాబు కౌంటర్.. నువ్వు నాకంటే చిన్నవాడివి..