దేశంలో వరుసగా మూడో రోజు కరోనా కేసులు 30 వేలకు దిగువనే నమోదయ్యాయి. కొత్తగా 26,041 కేసులు నమోదుకాగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రికవరీ రేటు 97.78%గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,99,620కి చేరింది. 191 రోజుల్లో ఇదే అత్యల్పం.




    1. మొత్తం కేసులు: 3,36,78,786

    2. మొత్తం రికవరీలు: 3,29,31,972

    3. మొత్తం మరణాలు: 4,47,194

    4. యాక్టివ్ కేసులు: 2,99,620

    5. మొత్తం వ్యాక్సినేషన్: 86,01,59,011 (గత 24 గంటల్లో 38,18,362)







కేరళలో..


కేరళలో కొత్తగా 15,951 కరోనా కేసులు నమోదయ్యాయి. 165 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 46,29,915కి చేరగా మొత్తం మరణాల సంఖ్య 24,603కి పెరిగింది.


మహారాష్ట్ర


మహారాష్ట్రలో కొత్తగా 3,206 కరోనా కేసులు వెలుగుచూశాయి. 36 మంది వైరస్‌తో మరణించారు. 3,292 మంది కరానా నుంచి రికవరయ్యారు. 


దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయి పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే సెకండ్ వేవ్‌లో జరిగిన నష్టాన్ని పునరావృతం చేయకూడదని కేంద్ర భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత మందికి వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఇప్పటికే పలు మార్లు ప్రశంసలు కురిపించింది. మరోవైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా ఇప్పటికే పెంచింది.


Also Read:Bharat Bandh: దేశవ్యాప్తంగా 'భారత్ బంద్' ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి