గులాబ్‌ తుఫాను త్రీవ వాయుగుండంగా మారిన వేళ తెలంగాణపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. తెలంగాణ మీదుగా తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేస్తూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం కాసేపటి క్రితం ట్వీట్ చేసింది.






ఆ ట్వీట్‌లోని వివరాల ప్రకారం.. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షం ఒకటి, రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో పడతాయని, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని అంచనా వేశారు. సోమవారం సాయంత్రం అతి తీవ్ర వర్షం పడుతుందని ట్వీట్ చేశారు.


Also Read: తుపాను తీరం దాటిన టైంలో జరిగిన బీభత్సం ఇదీ.. వెల్లడించిన కలెక్టర్, రేపు ఇంకో అల్పపీడనం


మరోవైపు, హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో సాయంత్రం స్థానిక వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేస్తూ వాతావరణ అధికారులు మరో ట్వీట్ చేశారు. ‘‘ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అత్యంత భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 22 డిగ్రీల వరకూ ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ ఉపరితల గాలులు, (గాలి వేగం గంటకు 22-25 కిలోమీటర్లు) వీచే అవకాశం ఉంది.’’ అని ప్రకటించారు.






ఇప్పటిదాకా హైదరాబాద్ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.9 డిగ్రీలు, 23.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని, గాలిలో తేమ శాతం 97 శాతం, వర్షపాతం 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రకటించారు.


Also Read: ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు షాక్! రైలు కింద పడి యువతి సూసైడ్


కాగా, రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని హెచ్చరించిన వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు ఆదేశించారు. ప్రజలంతా విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యుత్ వైర్లు తెగిన, ఎలాంటి విద్యుత్ సంబంధిత సమస్యలు ఉన్నా.. సంబంధిత సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 425 0028, 1912కి చేసి ఫిర్యాదు చేయవచ్చని కోరారు.


Also Read: అక్టోబర్లో బ్యాంకులకు 21 రోజులు సెలవు.. ఆర్థిక లావాదేవీలు ప్లాన్‌ చేసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి