రెండేళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరు ప్రేమికులు చివరికి తనువు చాలించారు. వీరి మరణానికి కుటుంబ సభ్యులే కారణమని పోలీసులు తెలిపారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో కలిసి బతకలేమని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. తొలుత యువకుడు సొంత ఊరిలో ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలుసుకున్న యువతి హైదరాబాద్‌లో ప్రాణాలు తీసుకుంది. ఈ హృద్యమైన ఘటన స్థానికంగా అందర్నీ కలచివేసింది.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండేళ్లుగా ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి కలకాలం జీవించాలని ఆశపడ్డారు. కులాలు వేరుకావడం.. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అర్ధాంతరంగా తనువు చాలించారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్‌కు చెందిన నాగమణి అనే 24 ఏళ్ల యువతి.. దుబ్బ తండాకు చెందిన ధరవత్‌ నెహ్రూ అనే 28 ఏళ్ల వ్యక్తి ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 


Also Read: హైదరాబాద్‌‌కు రెడ్ అలర్ట్! మరో 5 గంటల్లో అతి తీవ్రంగా వర్షం.. IMD ట్వీట్‌, హెచ్చరికలు


ఇతను స్థానికంగా సుతారి మేస్త్రీగా పని చేస్తుండగా నాగమణి ఇటీవల నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల చెవిన వేసింది. దీంతో నాగమణి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి నిరాకరించారు. అంతేకాక, మరో వ్యక్తితో ఆమెకు వివాహం చేసేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న ధరావత్‌ నెహ్రూ దుబ్బ తండాలోని తన నివాసంలో శనివారం ఉరేసుకొని చనిపోయాడు.


Also Read: మళ్లీ బాదుడే..! మరింత ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా ధరలివే..


నెహ్రూ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న అతడి ప్రియురాలు నాగమణి తట్టుకోలేకపోయింది. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌- చందానగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి అదే రోజు రాత్రి ప్రాణాలు విడిచారు. ఆమె మృతదేహన్ని కుటుంబ సభ్యులు సుందరయ్య నగర్‌కు ఆదివారం తీసుకొచ్చారు. కుమార్తె చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు విపరీతంగా విలపించారు. ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా నాగమణి మరణంపై దర్యాప్తు జరుపుతున్నట్లు నాంపల్లి రైల్వే పోలీసులు వెల్లడించారు.


Also Read: అక్టోబర్లో బ్యాంకులకు 21 రోజులు సెలవు.. ఆర్థిక లావాదేవీలు ప్లాన్‌ చేసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి