మీరు అసంఘటిత రంగంలో కార్మికులా? మీ నెలవారీ జీతం లేదా ఆదాయం రూ.15 వేలు లేదా అంతకన్నా తక్కువ ఉంటుందా? అయితే, మీకు ఓ శుభవార్త. మీరు ఈ పేరును కేంద్ర ప్రభుత్వ పథకమైన ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు కొన్ని ప్రయోజనాలు చేకూరతాయి. ముఖ్యంగా మీరు ఏదైనా ప్రమాదం లేదా అనారోగ్యం బారిన పడ్డ సమయంలో ఆ తలకు మించిన ఖర్చుల బాధ నుంచి మీరు విముక్తి పొందవచ్చు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత, కార్మికులకు ప్రమాదం జరిగితే రూ.2 లక్షల బీమా లభిస్తుంది. ఇదొక్కటే కాకుండా కుటుంబం మొత్తానికి ఏటా రూ.5 లక్షల వరకు ఆరోగ్య రక్షణ కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకం కూడా మీకు వర్తించనుంది. ఇవి మాత్రమే కాకుండా కరోనా లాంటి అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేసే సహాయాలు కూడా మీకు నేరుగా అందుతాయి.


Also Read: హైదరాబాద్‌‌కు రెడ్ అలర్ట్! మరో 5 గంటల్లో అతి తీవ్రంగా వర్షం.. IMD ట్వీట్‌, హెచ్చరికలు


ఈ-శ్రమ్ పోర్టల్‌లో చేరేందుకు మీకు ఏదైనా సహాయం కావాలంటే.. హెల్ప్‌లైన్ నంబర్ 14434 ని సంప్రదించవచ్చు. అదే సమయంలో www.gms.eshram.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. ఏవైనా ఫిర్యాదులున్నా వీటిలోనే చేయవచ్చు. అసంఘటిత రంగ కార్మికులలో భవన నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు, రిక్షా కార్మికులు, చిరు వ్యాపారులు, వలసకూలీలు, ప్లాట్‌ ఫారమ్ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, ఇంకా నెలవారీ ఆదాయం రూ.15 వేల లోపు ఉండే అందరు కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్ వర్తించనుంది.


Also Read: అక్టోబర్‌ 3 నుంచే గ్రేట్‌ ఇండియన్ సేల్‌.. ఆఫర్లు, ప్రత్యేకతలు ఇవే!


ఎలా నమోదు చేసుకోవాలి?
మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేసి ఉంటే, ఈ-శ్రమ్ పోర్టల్‌లో మీకు మీరే నమోదు చేసుకోవచ్చు. దీని కోసం, e-Shram పోర్టల్ www.eshram.gov.in కి వెళ్లాలి. అదే సమయంలో మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయని వారు సీఎస్‌సీ (కామన్ సర్వీసెస్ సెంటర్స్ స్కీమ్) కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి కార్మికులు బయోమెట్రిక్ పద్ధతి ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సీఎస్‌సీ పత్రంపై ఈ-శ్రమ్ కార్డును ముద్రించి కార్మికుడికి అందజేస్తారు. నమోదు పూర్తిగా ఉచితంగా ఉంటుంది.


Also Read: మళ్లీ బాదుడే..! మరింత ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా ధరలివే..


ఎవరు నమోదు చేసుకోవచ్చు
16 నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారు అయి, కార్మికుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) లేదా స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రయోజనాలను పొందని కార్మికులు దీనికి అర్హులుగా పరిగణిస్తారు. ఈఎస్ఐ కార్డు ఉన్నవారు.. పీఎఫ్ కట్ అయ్యేవారు అర్హులు కారు. అంతేకాక, ఏమాత్రం ఆదాయపు పన్ను చెల్లింపుదారులైనా వారు అర్హులు కారు. కార్మికులైన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది వర్తించదు.


Also Read: అక్టోబర్లో బ్యాంకులకు 21 రోజులు సెలవు.. ఆర్థిక లావాదేవీలు ప్లాన్‌ చేసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి