పండగల సీజన్ కావడంతో అక్టోబర్ నెలలో బ్యాంకులకు ఎక్కువగా సెలవులు వచ్చాయి. ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల పండుగులు, సంస్కృతులను బట్టి ఈ నెల బ్యాంకులకు ఏకంగా 21 రోజులు సెలవులు ప్రకటించారు. కాబట్టి ప్రజలు, వినియోగదారులు పనిదినాలను గమనించి ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం మంచిది. ఈ నెల్లోనే దసరా, ఈద్ ఈ మిలాదున్నబీ వంటి పర్వదినాలు ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: బుల్.. భలే రన్! 60వేల పైనే ముగిసిన సెన్సెక్స్.. ఆ 4 కంపెనీలే కీలకం
రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం ఈ నెల 14 రోజులు బ్యాంకులకు సెలవు. ఇక ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు కలిపి ఏడు వారాంతపు సెలవులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఆయా రాష్ట్రాలను బట్టి మారుతాయి. సాధారణంగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం, రియల్ టైం గ్రాస్ సెటిల్ మెంట్, బ్యాంకు క్లోజింగ్ అకౌంట్స్ ప్రకారం ఆర్బీఐ సెలవులు ప్రకటిస్తుంది.
Also Read: మళ్లీ దుమ్మురేపిన జియో.. పోటీలో ఎయిర్‌టెల్! వొడాఫోన్ ఐడియాకు కష్టాలు
సెలవులు ఇవే
అక్టోబర్ 3, 9, 10, 17, 23, 24, 31న వారాంతపు (ఆదివారం, రెండో, నాలుగో శనివారాలు) సెలవులు. అక్టోబర్ 1న బ్యాంకులకు అర్ధవార్షిక సెలవు (గ్యాంగ్‌టక్), 2న గాంధీ జయంతి, 6న మహాలయా అమావాస్య (అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా), 7న మెరా చావోరెన్ హౌబా (ఇంఫాల్), 12న దుర్గా పూజ , మహా సప్తమి (అగర్తలా, కోల్‌కతా), 13న మహా అష్టమి (అగర్తలా, భువనేశ్వర్, గ్యాంగ్ టక్, గువాహటి, ఇంఫాల్, కోల్‌కతా, పట్నా, రాంచీ), 14న మహా నవమి, దసరా, ఆయుధ పూజ (అగర్తలా, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గువాహటి, కాన్పూర్, కోచి, కోల్‌కతా, లక్‌నవూ, పట్నా, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం), 15న విజయ దశమి, దసరా (ఇంఫాల్, షిమ్లా మినహా దేశవ్యాప్తంగా), 16న దుర్గాపూజ-దసైన్ (గ్యాంగ్‌టక్), 18న కాటిబిహూ (గువాహటి), 19న ఈద్ ఈ మిలాద్ /మిలాద్ ఈ షెరిఫ్, 20న మహారుషి వాల్మీకీ జయంతి, లక్ష్మీపూజ, ఈద్ ఈ మిలాడ్ (అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా, షిమ్లా), 22l ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ (జమ్ము, శ్రీనగర్), 26న యాక్సెషన్ డే (జమ్ము, శ్రీనగర్)
Also Read: మరింత పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ భారీగా.. హైదరాబాద్‌లో స్థిరం
Also Read: 22 లక్షల కోట్ల అప్పు! భయం ముగింట్లో ప్రపంచం.. భారత్‌పై ప్రభావం ఏంటి?