దేశంలో  హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గత నెల రోజులకు పైగా స్థిరంగానే ఉంటున్నాయి. తెలంగాణలో వరంగల్ నగరంలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉంటున్నా.. తాజాగా స్వల్ప మార్పులు కనిపించాయి.


తెలంగాణలో సెప్టెంబరు 24న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.26 కాగా.. డీజిల్ ధర రూ.96.69 గా ఉంది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.06 పైసలు పెరిగి.. రూ.104.83గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.96.28 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా స్వల్పంగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.05 పైసలు పెరిగి రూ.105.43గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు పెరిగి రూ.97కు చేరింది. నిజామాబాద్‌లో పెట్రోల్ ధర స్వల్పంగా పెరిగింది. పెట్రోల్ ధర రూ.0.62 పైసలు పెరిగి రూ.107.34 గా ఉంది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.57 పైసలు పెరిగి రూ.98.62 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


Also Read: Gold-Silver Price: గూడ్‌న్యూస్! తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం స్థిరంగా, నేటి తాజా ధరలివే..


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.87 పైసలు తగ్గి.. ప్రస్తుతం రూ.107.39 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.81 పైసలు తగ్గి రూ.98.33కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.


విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.96గా ఉంది. గత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.41 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.97.87గా స్థిరంగానే ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.


Also Read: Freshworks Nasdaq Listing: కోటీశ్వరులైన 500+ ఉద్యోగులు... ఫ్రెష్‌వర్క్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంచలనం!


తిరుపతిలో బాగా తగ్గుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.43 పైసలు తగ్గి రూ.107.66 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.40 పైసలు పెరిగి రూ.98.53గా ఉంది.


Also Read: Oyo Hotels IPO: జొమాటో బాటలో ఓయో! ఐపీఓకు రానున్న హోటల్‌ అగ్రిగేటర్‌ కంపెనీ


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 24 నాటి ధరల ప్రకారం 73.62 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


Also Read: Banking Trojan Malware: ఆండ్రాయిడ్ ఫోన్‌లో బ్యాంకింగ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఇలా అస్సలు చేయకండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి