గులాబ్‌ తుఫాను వల్ల దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతోపాటో మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఒడిశా వైపు నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే 13 రైళ్లను రద్దు చేయగా, మరో 16 రైళ్లను దారిమళ్లించింది. వీటిలో నేడు బయలుదేరాల్సిన కేఎస్‌ఆర్‌ బెంగళూరు సిటీ-భువనేశ్వర్‌, యశ్వంత్‌పుర్‌-బెంగళూరు, తిరుపతి-భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌, హెచ్‌ఎస్‌ నాందేడ్‌-సంబాల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌‌, కోయంబత్తూర్‌-ముంబయి ఎల్‌టీటీ రైళ్లు ఉన్నాయి.


రద్దు చేసిన రైళ్లు
26.09.2021న
08445 - భువనేశ్వర్ - జగదల్‌పూర్
02097 - భువనేశ్వర్ - జునాగఢ్ రోడ్
08127 - రూర్కెలా - గునుపూర్
27.09.2021న 
08446 - జగదల్‌పూర్- భువనేశ్వర్
02098 - జునాగర్ రోడ్ - భువనేశ్వర్
08128 - గునుపూర్ - రూర్కెలా


మళ్లించిన రైళ్ల స‌మాచారం..
ఖ‌ర‌గ్‌పూర్‌, జ‌ర్సుగూడా, బల్హర్షా మీదుగా మ‌ళ్లించిన వివ‌రాలు..
26.09.2021న 
02703 - హౌరా - సికింద్రాబాద్
02245 - హౌరా-యశ్వంతపూర్
08645 -హౌరా-సికింద్రాబాద్ ప్రత్యేకం
02609 - సంత్రాగచి-తిరుపతి ప్రత్యేకం
02543 - హౌరా-చెన్నై సెంట్రల్ స్పెషల్
02663 - హౌరా-తిరుపతి ప్రత్యేకమైనది
08189 - టాటా-ఎర్నాకుళం


01020 - భువనేశ్వర్-సిఎస్‌టి స్పెషల్ సంబల్‌పూర్, తిత్లాగఢ్, రాయ్‌పూర్ మీదుగా మళ్లించారు
03352 - అలప్పుజా- ధన్బాద్ స్పెషల్ 25.06.2021న అలప్పుజా నుంచి బయలుదేరి బల్హర్షా, జ‌ర్సుగూడ మీదుగా మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
02544 - చెన్నై సెంట్రల్- హౌరా స్పెషల్ 26.09.2021న చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి బల్హర్షా, జ‌ర్సుగూడ మీదుగా మళ్లించారు.
02064- 25.09.2021న యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే రైలు యశ్వంత్‌పూర్-పూరి బల్హర్షా, ఐబి, సంబల్‌పూర్ సిటీ మీదుగా మళ్లించారు.
26.09.2021న హైదరాబాద్ నుంచి బయలుదేరే రైలు నంబర్ 08646 హైదరాబాద్-హౌరా స్పెషల్ బల్హర్షా, జ‌ర్సుగూడ, ఖరగ్‌పూర్ మీదుగా మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
02641 త్రివేండ్రం సెంట్రల్- షాలిమార్ స్పెషల్ 25.09.2021 న త్రివేండ్రం నుంచి బయలుదేరుతుంది.


రీ షెడ్యూల్ చేసిన రైళ్ల స‌మాచారం..
07480 - పూరి-తిరుపతి ప్రత్యేక పూరి వద్ద 11 గంటల రీషెడ్యూల్ చేశారు.
02873 - హౌరా-యశ్వంతపూర్ ప్రత్యేక హౌరా వద్ద 2 గంటల రీషెడ్యూల్ చేశారు.
02867 - హౌరా పాండిచ్చేరి ప్రత్యేక హౌరా వద్ద 2 గంటల రీషెడ్యూల్ చేశారు.
02704 - సికింద్రాబాద్-హౌరా సికింద్రాబాద్ వద్ద 3 గంటల రీషెడ్యూల్ చేశారు.
02246 - యశ్వంత్‌పూర్-హౌరా ప్రత్యేక రైలు యశ్వంత్‌పూర్‌లో 3 గంటల రీషెడ్యూల్ చేశారు.
07481 - తిరుపతి-బిలాస్‌పూర్ స్పెషల్ తిరుపతిలో 3 గంటల రీషెడ్యూల్ చేయ‌బ‌డింది.
08090 - తిరుపతి - హౌరా స్పెషల్ తిరుపతిలో 3 గంటల రీషెడ్యూల్ చేశారు.
02874 - యశ్వంతపూర్-హౌరా స్పెషల్ యశ్వంత్పూర్ వద్ద 3 గంటల రీషెడ్యూల్ చేశారు.


Also Read: గులాబ్‌ తుపాను ప్రభావం...ఆంధ్రప్రదేశ్ లో కుంభవృష్టి, తెలంగాణలో మరో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..హైదరాబాద్ లో హై అలెర్ట్


Also Read: గులాబ్ తుపాన్ ఎఫెక్ట్…హైదరాబాద్ వాసులు తప్పనిసరైతే కానీ బయటకు రావొద్దు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి