మూవీ ఆర్టిస్టుల సంఘం 'మా' ఎన్నికల వేడి ఈ 10రోజులు మరింత రంజుగా మారనుంది. విందు రాజకీయాలతో ఇప్పటికే అట్టుడుకుతున్న వర్గాలు ముందు ముందు మరింత అగ్గి రాజేయబోతున్నట్టే ఉంది.  అధ్యక్షపదవి రేసులో ఉన్న ప్రకాష్ రాజ్ చాలా రోజుల క‌్రితమే తన ప్యానెల్ సభ్యులను మీడియాకి పరిచయం చేసి అజెండా ప్రకటించగా.. ఇటీవలే మంచు విష్ణు తన ప్యానెల్ ని అజెండా ప్రకటించారు. అక్టోబర్ 10 న ఎన్నికలు జరిగి..ఆ సాయంత్రానికే ఫలితాలు  వెల్లడికానున్నాయి.  ఈ మేరకు సోమవారం ఉదయం ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో ఫిలింఛాంబర్ లో నామినేషన్ వేశారు.


ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్స్...
అధ్యక్షుడు: ప్రకాశ్‌రాజ్‌
ట్రెజరర్‌ : నాగినీడు
జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్‌
ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌
జనరల్‌ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌


ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవింద రావు, ఖయూమ్, కౌశిక్, ప్రగతి, రమణా రెడ్డి, శివా రెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు. డి, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్


మంచువిష్ణు ప్యానెల్ మెంబర్స్
మంచు విష్ణు - అధ్యక్షుడు
రఘుబాబు - జనరల్‌ సెక్రటరీ
బాబు మోహన్‌ - ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌
మాదాల రవి - వైస్‌ ప్రెసిడెంట్‌
పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి - వైస్‌ ప్రెసిడెంట్‌
శివబాలాజీ - ట్రెజరర్
కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ
గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ 


ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వర్ణ మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ఆర్సి


మంచు విష్ణు సెప్టెంబర్‌ 28న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్‌ల పరిశీలన ,  అక్టోబర్‌1-2 తేదీల్లో నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్‌ 10న 'మా' ఎన్నికల పోలింగ్‌ జరగి అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.  మెగా బ్రదర్స్ చిరంజీవి.. నాగబాబు అండ ప్రకాష్ రాజ్ కి ఉంది. పవన్ కల్యాణ్ సహా పలువురు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. అయితే నామినేషన్ వేసిన తరువాత మేనిఫెస్టో ప్రకటించి.. చిరంజీవి గారిని కలుస్తానని చెప్పిన మంచు విష్ణు ఆయన కచ్చితంగా తనకే  ఓటేస్తారని అనుకుంటున్నానని చెప్పారు. మంచు విష్ణుకు సూపర్ స్టార్ కృష్ణ-మహేష్ సహా నరేష్ వర్గాల అండదండలు ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సారి ఎన్నికల్లో 'మా'అధ్యక్షుడు ఎవరన్నది చూడాలి...


Also Read: ఆదిపురుష్ విడుదల తేదీకి ముహూర్తం ఫిక్సైంది... రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఇండిపెండెన్స్ డే కన్నా ముందే ట్రీట్..


Also Read: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ కన్నుమూత, సోషల్ మీడియా ద్వారా ప్రముఖుల సంతాపం


Also Read: గులాబ్ తుపాన్ ఎఫెక్ట్…హైదరాబాద్ వాసులు తప్పనిసరైతే కానీ బయటకు రావొద్దు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి