2020 నుంచి టాలీవుడ్‌ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు.  ఇప్పుడు పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్‌. ఆర్‌. వెంకట్‌ మృతి చెందారు.  సెప్టెంబర్ 27 ఉదయం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్స్ లో కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందారు.  ఆర్. ఆర్. మూవీ మేకర్స్ ద్వారా ఆయన పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడమే కాదు.. నిర్మాతగానూ భారీ సినిమాలు తెరకెక్కించారు. మహేష్ తో 'బిజినెస్ మేన్',  నాగార్జునతో 'ఢమరుకం', రవితేజతో 'కిక్' లాంటి అత్యంత భారీ చిత్రాల్ని వెంకట్ నిర్మించారు. 'సామాన్యుడు', 'ఆటోనగర్ సూర్య' ,'మిరపకాయ్', 'పైసా' చిత్రాలకు వెంకట్ నిర్మాత. 


గోపీచంద్ మలినేని
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ దుర్ఘటనపై స్పందించారు. నా మొదటి చిత్రం డాన్ శీను నిర్మాత ఆర్ ఆర్ ఆర్ వెంకట్. సినిమా పట్ల ఫ్యాషన్ ఉన్న నిర్మాత. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఆయన కుటుంబానికి నా సానుభూతి. రెస్ట్ ఇన్ పీస్ ఆర్ ఆర్ ఆర్ వెంకట్ గారు... అంటూ ట్వీట్ చేశారు. 






రవితేజ
నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ మరణవార్త కలచి వేసింది . నేను పని చేసిన నిర్మాతల్లో బెస్ట్ ప్రొడ్యూసర్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి... అంటూ రవితేజ ట్వీట్ చేశారు. 






సురేశ్ కొండేటి






2012 లో జోనాథన్ బెన్నెట్ నటించిన ఆంగ్ల చిత్రం `వెడ్డింగ్ ఇన్విటేషన్` చిత్రంతో  RR వెంకట్ హాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ - రమ్య కృష్ణ నటించిన `ఆహ్వానం` చిత్రానికి రీమేక్. ఆ తర్వాత అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. అవార్డు గెలుచుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ హిందీ చిత్రం ఏక్ హసినా థీకి నిర్మాతలలో ఒకరు. ఆర్.ఆర్ వెంకట్ రచయిత.. సామాజిక కర్త గానూ పేరు తెచ్చుకున్నారు. 2011 లో సామాజిక కార్యకర్తగా చేసిన కృషికి కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.పలువురు యువ నటీనటులకు అవకాశాలిచ్చారు. ఆర్‌. ఆర్‌. వెంకట్‌ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: గులాబ్‌ తుపాను ప్రభావం...ఆంధ్రప్రదేశ్ లో కుంభవృష్టి, తెలంగాణలో మరో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..హైదరాబాద్ లో హై అలెర్ట్


Also Read: గులాబ్ తుపాన్ ఎఫెక్ట్…హైదరాబాద్ వాసులు తప్పనిసరైతే కానీ బయటకు రావొద్దు...


Also Read: తుపాను తీరం దాటిన టైంలో జరిగిన బీభత్సం ఇదీ.. వెల్లడించిన కలెక్టర్, రేపు ఇంకో అల్పపీడనం


Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో రద్దైన, దారిమళ్లించిన రైళ్ల వివరాలివే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి