బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా కాస్త కండలు పెంచి కనిపిస్తే చాలు.. ఏంటి మైక్ టైసన్ లా ఉన్నావ్ అంటూ మనకి తెలియకుండానే అనేస్తూ ఉంటాం. అంతగా మనపై ప్రభావం చూపించాడు మైక్ టైసన్. దశాబ్దాల పాటు బాక్సింగ్ చేసి తన క్రేజ్ ను పెంచుకున్న మైక్ టైసన్ ఒక తెలుగు సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది..? అది కూడా విజయ్ దేవరకొండ లాంటి యంగ్ సెన్సేషనల్ హీరోతో అంటే అంచనాలు ఏ రేంజ్ లో పెరిగిపోతాయో ఊహించలేం.
Also Read: 'మీ వెనుక గొర్రెలు కాదుకదా.. వాటి బొచ్చు కూడా రాదు.. అడివి మీ అబ్బ సొత్తేమ్ కాదు'
అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేశారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఏ సినిమానైనా.. మూడు నెలల్లో తీసేసే పూరి జగన్నాథ్ తొలిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. కరణ్ జోహార్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఓ భాగమయ్యారు. దీంతో ఈ సినిమా రేంజ్ మరింత పెరిగింది. చాలా కాలంగా ఈ సినిమాలో మైక్ టైసన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.
'ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్, ది గాడ్ ఆఫ్ బాక్సింగ్, ది లెజెండ్, ది బీస్ట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అంటూ మైక్ టైసన్ ను పొగుడుతూ.. తన సినిమాలో ఆయన నటించబోతున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు విజయ్ దేవరకొండ. ఈ వీడియోను చూస్తుంటే.. సినిమాలో విజయ్ దేవరకొండ-మైక్ టైసన్ ల మధ్య బాక్సింగ్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. మరి ఈ సన్నివేశాలను డైరెక్టర్ ఏ రేంజ్ లో చిత్రీకరిస్తారో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రొఫెషనల్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్న విజయ్.. తన మేకోవర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
Also Read: ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..
Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్
Also Read: 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి