Cyclone Gulab Live Updates: జేఎన్‌టీయూ పరిధిలో సెప్టెంబర్ 29న జరగాల్సిన పరీక్షలు వాయిదా

గులాబ్‌ తుఫాన్‌ తీరంలో కల్లోలం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకిన గులాబ్‌. 11 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటింది.

ABP Desam Last Updated: 28 Sep 2021 08:21 PM

Background

 గులాబ్ తుపాను, భారీ వర్షాల కారణంగా తెలంగాణ శాసన సభ వర్షకాల సమావేశాలకు  మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. అధికారులు, శాసన సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరిగి అక్టోబర్ 1న...More

జేఎన్‌టీయూహెచ్ పరిధిలో సెప్టెంబర్ 29న జరగాల్సిన పరీక్షలు వాయిదా

జేఎన్‌టీయూహెచ్ పరిధిలో సెప్టెంబర్ 29న జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అదికారులు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రకటనలో వెల్లడించారు. సెప్టెంబర్ 30 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని పేర్కొన్నారు.