ఓ బాలిక వయసు 14 ఏళ్లు.. తల్లి మూడేళ్ల క్రితమే చనిపోయింది. తండ్రి బతుకుదెరువు కోసం మరో ఊరిలో ఉంటున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో బాలిక ఒంటరిగానే ఉంటోంది.  అయితే బాలికపై జరిగిన దారుణకాండ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమీప బంధువు సహా మరో నలుగురు స్నేహితులు ఎనిమిది నెలలుగా బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో శిశువును బావిలో విసిరేయగా.. మృతిచెందింది. పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారించడంతో.. ఆమెపై జరిగిన అత్యాచారకాండ వెలుగుచూసింది.


Also Read: Hyderabad: ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు షాక్! రైలు కింద పడి యువతి సూసైడ్


Also Read: Sarpunch Suicide: భర్త చేసిన పని తట్టుకోలేకపోయిన మహిళా సర్పంచ్, వెంటనే ఆత్మహత్య.. ఏం జరిగిందంటే..


ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్‌లోని భదోరియాకు చెందిన 14 ఏళ్ల బాలిక తల్లి మూడేళ్ల క్రితం చనిపోయింది. తండ్రి బతుకుదెరువు కోసం మరో చోట ఉంటున్నాడు. ఊర్లో బాలిక ఒంటరిగానే ఉంటుంది. తరచు ఆమె ఇంటి ఓ బంధువు(21) వచ్చేవాడు. 8 నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన నలుగురు స్నేహితులతో కలిసి పలుమార్లు బాలికపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయినట్లు తెలుసుకున్నారు. ప్రెగ్నెన్సీ పోవాలని ఆమెకు ట్యాబ్లెట్లు వేశారు. తీవ్ర గర్భస్రావమై బిడ్డకు జన్మనిచ్చింది.   ఆ బిడ్డను బాలిక బంధువు బావిలో విసిరేశారు. 


Also Read: Nellore News: పోలీస్ స్టేషన్ లో ప్రేమ పంచాయితీ... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్... కానీ


Also Read: Hyderabad News: మణికొండలో డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడు... 48 గంటల తర్వాత మృతదేహం లభ్యం...


బావిలో శిశువు మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో మొదట ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు. తనపై జరిగిన ఆకృత్యాలను బాలిక పోలీసులకు వెల్లడించింది. వెంటనే పోలీసులు ఆమె బంధువుతో పాటు అతని స్నేహితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నట్లు గుర్తించారు. బాలికను జువైనల్ బోర్డు ముందు ప్రవేశపెట్టి... అనంతరం జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.


Also Read: Cyclone Updates: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..


Also Read: AP Gulab Cyclone Effect: గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ప్రకటించిన సీఎం జగన్


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి