నెల్లూరు జిల్లాలో బహిరంగంగా జరుగుతున్న వ్యభిచార దందా గుట్టు రట్టయింది. రాత్రి వేళ ఆరుబయట జరుగుతున్న అసాంఘిక లైంగిక కార్యకలాపాలను స్థానికులు గుర్తించారు. అటుగా వెళ్తున్న వాహనదారులు అప్రమత్తమై చొరవ చూపడంతో ఈ వ్యభిచార ముఠా బయటపడింది. నెల్లూరు మండలంలోని పుంజులూరుపాడు రైల్వే గేటు సమీపంలో ఈ అసాంఘిక కార్యకలాపాలు చాలా కాలంగా సాగుతున్నట్లుగా స్థానికులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. తాజాగా స్థానికులు చొరవ చూపడంతో గుట్టంతా బయటపడింది.


Also Read: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..


స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లూరు మండలంలోని పుంజులూరుపాడు రైల్వే గేటు సమీపంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుకు ఆనుకున్న ప్రాంతంలో ఆదివారం రాత్రి 10.30 సమయంలో ఈ సంఘటన జరిగింది. పుంజులూరుపాడు వైపు వెళ్తున్న వాహన దారులకు రోడ్డు పక్క నుంచి మహిళలు కేకలు పెద్దగా వినిపించాయని సాక్షులు వెల్లడించారు. దాంతో వారు వాహనాలను పక్కనే ఆపి.. రోడ్డు నుంచి కాస్త దూరం వెళ్లి గమనించగా.. అక్కడ పదుల సంఖ్యలో లారీలను నిలిపి ఉన్నారు.


Also Read: e-Shram Card: మీ జీతం 15 వేల కంటే తక్కువా? మీకో శుభవార్త.. ఈ ఒక్క పని ఫ్రీగా చేస్తే ఎన్నో లాభాలు


వాటిని కూడా దాటుకొని కాస్త ముందుకు వెళ్లగా.. అక్కడ వారికి ముగ్గురు మహిళలు, సుమారు 20 మంది వరకూ పురుషులు కనిపించారు. ఆ మహిళలతో పురుషులు బలవంతంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం చూశారు. దీంతో వెంటనే స్థానికులు వెంకటాచలం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణం స్పందించి అక్కడకు చేరుకొని, అసాంఘిక కార్యకలాపాల నిర్వహకులను పట్టుకొనేందుకు ప్రయత్నించగా.. అప్పటికే నిర్వహకులు విటులు అక్కడి నుంచి పరారయ్యారు. 


Also Read: చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరింత పెరుగుదల


ఇద్దరు మహిళలను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. నిర్వహకుడిది వెంకటాచలం పంచాయతీ పరిధిలోని వడ్డిపాళెం అని తేలింది. అతను కొన్ని నెలలుగా బయట ప్రాంతాల నుంచి మహిళలను తీసుకుని వచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై నెల్లూరు రూరల్‌ సీఐ జగన్‌మోహన్‌ రావును వివరణ కోరగా పోర్టు రోడ్డులో కొద్ది రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ పనులకు సూత్రదారి అయిన వ్యక్తి నిర్వహకుడు పరారీలో ఉన్నాడని, అతణ్ని పట్టుకొని విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి