కొత్త మోడళ్లలో క్రియేటివ్‌గా ఆభరణాలు డిజైన్ చేయడమంటే మీకు ఇష్టమా? మీ ఆభరణాలను మీరే డిజైన్ చేసుకుంటారా? మీలాంటి వారి కోసం అద్భుతమైన కోర్సు ఒకటుంది. దీని పేరు జ్యుయెలరీ డిజైనింగ్ (Jewellery Designing). ఇందులో సర్టిఫికేషన్, డిప్లొమా, డిగ్రీ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ (10+2 ) పాస్ అయిన వారు జ్యుయెలరీ డిజైనింగ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు చేసేందుకు అర్హులు. ఇందులో డిగ్రీ ఉన్న వారికి మంచి ఉద్యోగావకాశాలు కూడా ఉన్నాయి. ఆభరణాలను డిజైన్ చేయడంలో జ్యూయలరీ డిజైనర్ల పాత్ర చాలా కీలకం. జ్యుయెలరీ డిజైనింగ్ మీద ఆసక్తి గల వారు ఈ రంగంలో రాణించగలరు.
ఆభరణాలు అంటే బంగారం మాత్రమే అనే అభిప్రాయానికి కాలం చెల్లిందంటే అతిశయోక్తి కాదు. మారుతోన్న టెక్నాలజీ సాయంతో కొత్త కొత్త ఆభరణాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వన్ గ్రామ్ గోల్డ్, రెడీ టూ వేర్ వంటి ఆభరణాలు బంగారం కంటే ఎక్కువ మోడల్స్ లో లభిస్తున్నాయి. ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండటంతో చాలా మంది వీటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా విభిన్న రీతిలో అద్భుతమైన డిజైన్లలో ఆభరణాలు రూపొందించే వారి కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి. టాలెంట్ ఉన్న వారి కోసం భారీ వేతనాలను ఇచ్చి మరీ కొలువులు ఇస్తున్నాయి. దీంతో జ్యూయెలరీ డిజైనర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత జ్యుయెలరీ ఇండస్ట్రీ 13 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.
Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?
ఈ స్కిల్స్ ఉంటే మీరు అర్హులే..
ఆభరణాల డిజైనింగ్ పై మక్కువ ఉండటంతో పాటు క్రియేటివ్ థింకింగ్, సాంకేతిక నైపుణ్యాలు, లోహాలు, లోహ మిశ్రమాలకు సంబంధించిన రసాయన శాస్త్ర అవగాహన ఉండాలి. వీటితో పాటు కెమికల్ ఈక్వేషన్స్ అర్థం చేసుకోవగలగాలి. ఈ అంశాలను కోర్సుల రూపంలో నేర్చుకోవచ్చు. దీని ద్వారా డిజైనింగ్ స్కిల్స్‌తో పాటు క్యాస్టింగ్, ఎన్‌గ్రేవింగ్, స్టోన్ కట్టింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, పాలిషింగ్, ఏనోడైజింగ్, మెటల్ కలరింగ్, స్టోన్ సెట్టింగ్, ఎనామ్లింగ్, సిల్వర్ స్మిత్తింగ్ వంటి అనేక నైపుణ్యాలను కూడా కోర్సులో భాగంగా నేర్పిస్తారు.
రూ.లక్ష వరకు వేతనం..
జ్యూయెలరీ డిజైనింగ్ కోర్సు చేసిన వారికి ప్రెవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయి. డిజైనర్ స్కిల్స్, అనుభవం ఆధారంగా ఈ రంగంలో వేతనాలు ఉంటాయి. ప్రారంభ వేతనం నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు అందిస్తారు. తర్వాత సామర్థ్యానికి అనుగుణంగా నెలకు రూ.లక్ష వరకు వేతనం అందించే అవకాశం ఉంది.
కోర్సు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు..
కాలేజీ | లొకేషన్ (కోర్స్) | వెబ్‌సైట్ వివరాలు |
Hamstech ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ & ఇంటీరియర్ డిజైన్ (HAMSTECH), పంజాగుట్ట | హైదరాబాద్ (సర్టిఫికెట్ కోర్స్ ఇన్ జ్యుయెలరీ డిజైన్) | www.hamstech.com |
నిఫ్ట్ (NIFT), ఢిల్లీ | ఢిల్లీ | www.nift.ac.in/delhi |
ఐఐటీ (IIT) | మల్టిపుల్ లొకేషన్స్ | www.iitb.ac.in |
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) | మల్టిపుల్ లొకేషన్స్ | www.nid.edu |
ARCH అకాడమీ ఆఫ్ డిజైన్ (ARCHEDU) | జైపూర్ | www.archedu.org |
Vogue ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ | బెంగళూరు | www.voguefashioninstitute.com |
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యుయెలరీ డిజైన్ | అహ్మదాబాద్ (డిప్లొమా ఇన్ యాక్సెసరీ అండ్ జ్యుయెలరీ డిజైన్) | www.dsiidc.org/nij/courseoffer.html |
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యుయెలరీ డిజైన్ (IIJ) | అహ్మదాబాద్ (డిప్లొమా ఇన్ యాక్సెసరీ అండ్ జ్యుయెలరీ డిజైన్) | www.iij.net.in |
Amor డిజైన్ ఇన్‌స్టిట్యూట్ | అహ్మదాబాద్ (డిప్లొమా ఇన్ యాక్సెసరీ అండ్ జ్యుయెలరీ డిజైన్) | www.amordesign.org |
ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ | పూణె (డిప్లొమా ఇన్ యాక్సెసరీ, ఫ్యాషన్ అండ్ జ్యుయెలరీ డిజైన్) | www.iitcworld.com |
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..
Also Read: Career Guidance: చరిత్ర అంటే ఇష్టమా? ఇది కూడా బెస్ట్ కెరీర్ ఆప్షనే.. మీకేం కావాలో ఎంచుకోండి..