VMI: తండ్రికి వెనకడుగు వేయక తప్పని పరిస్థితి కల్పించిన విజయ్.. సంతోషంలో అభిమానులు

దళపతి విజయ్‌కి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పార్టీని రద్దు చేసినట్టు ప్రకటించారు.

Continues below advertisement

తమిళ అగ్ర హీరో విజయ్ కి కేవలం కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.  బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా చెప్పొచ్చు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్  త్వరలోనే వంశీ పైడిపల్లి సినిమాతో డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ లో నటించనున్నాడు.  ఇక అసలు విషయానికొస్తే  విజయ్ తండ్రి తమిళంలో అగ్రదర్శకుడిగా గుర్తింపుతెచ్చుకున్న ఎస్ ఏ చంద్రశేఖర్. గతేడాది విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్..'ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' అనే పేరు మీద రాజకీయ పార్టీ ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఈ పార్టీని నమోదు కూడా చేశారు. అప్పట్లో విజయ్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలొచ్చాయి కూడా. అప్పట్లో విజయ్  తన తండ్రి స్థాపించిన పార్టీకి తనకు సంబంధం లేదన్నాడు. అయినప్పటికీ  ఈ పార్టీలో విజయ్ తండ్రి జనరల్ సెక్రెటరీగా, తల్లి శోభ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. తనకి ఆసక్తి లేదని చెప్పినా పట్టించుకోపోవడంపై విజయ్...తల్లిదంద్రుడులపై  కేసు పెట్టాడు.  తనను సంప్రదించకుండా తన పేరుతో రాజకీయ పార్టీ పెట్టడంపై తల్లి దండ్రులతో కలిపి మొత్తం 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో  కేసు వేశాడు.

Continues below advertisement

తన పేరున తండ్రి  పార్టీ పెట్టారని తన ఫ్యాన్స్ ఎవరిని కూడా అందులో చేరవద్దని క్లారిటీ ఇచ్చాడు. ఇక తన తల్లి తండ్రి పెట్టిన పార్టీ కోసం తన పేరు, తన ఫోటోలు ఉపయోగిస్తున్నారని అంతేకాకుండా ఫ్యాన్స్ క్లబ్ ను కూడా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.  ఇకపై తన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, రాజకీయ మీటింగులు నిర్వహించకుండా ఉండేందుకే ఈ కేసు పెట్టానన్నాడు. దీనిపై స్పందించిన విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్.. తన కుమారుడి పేరిట ఏర్పాటు చేసిన పార్టీని వెంటనే రద్దు చేస్తున్నట్టు కోర్టుకు తెలిపారు. అంతేకాదు ఈ పార్టీని సంబంధించిన అన్నింటిని  కోర్టుకు సమర్పిస్తున్నట్టు తెలియజేసారు.  విజయ్ మక్కలు ఇయ్యమ్ రాజకీయ పార్టీగా కాకుండా ఫ్యాన్ అసోసియేషన్‌గా కొనసాగించబోతున్నట్టు వివరించారు. దీనిపై స్పందించిన విజయ్ అభిమానులు తనని రాజకీయాల్లోకి లాగొద్దని హీరోగానే కొనసాగించాలని కోరుతున్నారు. 

Also Read: బన్నీ- లెక్కల మాస్టారు తగ్గేదే లే అన్నారు...ఇప్పుడు తగ్గక తప్పడం లేదా..!

Also Read: దర్శకుడు పూరీ జగన్నాథ్ కి మైండ్ బ్లోయింగ్ విషెష్ చెప్పిన అభిమాని

Also Read: హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ పూరీ , మందు గ్లాసుతో దర్శకుడికి బర్త్ డే విషెష్ చెప్పిన బ్యూటీ

Also read:మన న్యాచురల్ స్టార్ కి బాలీవుడ్ హీరో నుంచి ప్రశంసలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

Continues below advertisement
Sponsored Links by Taboola