ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ టికెట్ల విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సినీ పరిశ్రమకు మంచి చేయాలనే ఏపీ ప్రభుత్వం చూస్తుందని, బురద చల్లాలని చూస్తే పవన్‌ కల్యాణ్​కే ఇబ్బంది అని సజ్జల వ్యాఖ్యానించారు.  పవన్‌ను సినీ పరిశ్రమ పెద్దలు గుదిబండగా భావిస్తున్నారన్నారు. పవన్ సినిమా, రాజకీయాలు అనే రెండు పడవలపై పయనిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారని తెలిపారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుందన్నారు. ఏపీలో జనసేన అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. మటన్‌ షాపులు పెడతారన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. మటన్‌ షాపుల్లో నాణ్యత, శుభ్రత పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని సజ్జల తెలిపారు. 




Also Read: ఉపఎన్నికలపై హఠాత్తుగా మనసు మార్చుకున్న ఈసీ ! తెర వెనుక ఏం జరిగింది ?


బద్వేల్ లో వైసీపీదే విజయం


కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంందని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమావ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. ప్రజల అభిమానం, ఆదరణ వైసీపీ ఉన్నాయని సజ్జల తెలిపారు. ప్రతి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్న ఆయన.. సీఎం జగన్ పాలనపై ప్రజలకు నమ్మకముందన్నారు. బద్వేలులో మంచి మెజారిటీతో గెలుస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 


 Also Read   : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..


బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ


బద్వేలు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బద్వేల్ ఉపఎన్నికలో దాసరి వెంకట సుబ్బయ్య భార్య సుధ అభ్యర్థిగా ఉంటారని సీఎం జగన్ చెప్పారని గుర్తుచేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబంలోని వారికే టికెట్‌ ఇవ్వడం వైసీపీ సంప్రదాయమని పేర్కొన్నారు. సానుభూతిగా మిగిలిన ఇతర పార్టీల వారు పోటీలో ఉండకపోవడం కూడా సంప్రదాయమన్నారు. ఒకవేళ పోటీ పెట్టినా అంతే సీరియస్‌గా తీసుకుని గెలిచితీరుతామన్నారు. నంద్యాల ఎన్నికకు ఈ ఉప ఎన్నికకు పోలిక లేదన్న సజ్జల.. నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి సీఎం చంద్రబాబు జనరల్ ఎన్నికలుగా భావించారన్నారు. ఆ ఎన్నికల్లో రూ.100 కోట్ల వరకు పంచారని ఆరోపించారు. పథకాలు ఆగిపోతాయని బెదిరించి గెలిచారని సజ్జల అన్నారు. ఈ ఉపఎన్నికలో గతంతో వైసీపీకి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువే రావచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు. 


Watch Video  : రాజకీయాల్లోనే కాదు.. కర్రసాములోనూ ఈ మహిళా లీడర్ ప్రదర్శన సూపర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి