రాజకీయాల్లోనే కాదు.. కర్రసాములోనూ ఈ మహిళా లీడర్ ప్రదర్శన సూపర్
రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే మహిళా నేత కర్ర సాము చేస్తే ఎలా ఉంటుంది? కేవలం ఒక రాజకీయ నాయకురాలిగా పరిచయం ఉన్న ఆమె కర్రసాములో నైపుణ్యం ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కర్రసాము ప్రదర్శన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంధ్యారాణి అక్కడున్న వారు కోరడంతో కర్రసాము చేశారు.
Tags :
Peddapalli Palakuthi Zptc Kandhula Sandhyarani Woman Zptc Participated In Karrasamu Karrasamu Videos