సాధారణంగా 14 ఏళ్ల అబ్బాయి అంటే ఏం చేస్తుంటాడు? పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఇప్పుడు అంటే ఆన్ లైన్ క్లాసులు కాబట్టి... వీలైనంత ఎక్కు వ సమయాన్ని కంప్యూటర్ల ముందు గడుపుతుంటారు. లేదంటే గేమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ, అహ్మదాబాద్‌కు చెందిన ఓ 14ఏళ్ల కుర్రాడు మాత్రం దహీ కచోరీ తయారు చేసి అమ్ముకుంటున్నాడు. ఈ కుర్రాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Also Read: Afghan Girl Speech: నాకు స్కూల్‌కి వెళ్లాలని ఉంది... అఫ్గాన్ అమ్మాయి ఆవేదన... నెట్టింట్లో వీడియో వైరల్






అసలు కథేంటంటే... అహ్మదాబాద్‌కు చెందిన ఓ 14 ఏళ్ల కుర్రాడు మణినగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా తినుబండారాల బండి నడిపిస్తున్నాడు. ఫుడ్ ప్రేమికుల ఆర్డర్ మేరకు గ్రీన్, రెడ్ చట్నీలు, పెరుగు, కారపూస వేసి వారికి అందిస్తున్నాడు. ఈ దహీ కచోరీ విలువ రూ.10 మాత్రమే. ఈ పిల్లాడు ఆర్డర్ మేరకు దహీ కచోరీ ఎలా తయారు చేసిన వీడియోని ఫుడ్ బ్లాగర్ దొయాష్ పతర్బే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.






అతడు షేర్ చేసిన కొద్ది సమయంలోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. తన తల్లిదండ్రులకు సాయం చేయడానికి ఇలా తండ్రి నడిపే బండి వద్దకు వచ్చాడట. ‘అతడో పోరాటయోధుడు. భవిష్యత్తులో ఎంతో విజయవంతం అవుతాడు. కానీ, రూ.10కే కచోరీ అమ్మడం తక్కవగా అనుకుంటున్నా. ఇలాగే అమ్మితే వారికి ఏం లాభాలు వస్తాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ కుర్రాడి వివరాలు, ఫోన్ నెంబర్ ఇవ్వండి... ఆర్థికంగా సాయం చేస్తాం అని మరికొందరు అడుగుతున్నారు.  


రెండు రోజుల్లోనే ఈ కుర్రాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో... ఈ వీడియో చూసిన స్థానికులు ఆ బండి వద్దకే వెళ్లి కచోరీ తింటున్నారు. 10 రూపాయలకే ఇంత టేస్టీ కచోరీ గతంలో ఎప్పుడూ తినలేదని వారు కామెంట్లు పెడుతున్నారు. దీంతో అతడి బండి వద్ద కచోరీ అమ్మకాలు రెట్టింపయ్యాయి. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి