అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు తమ వశం చేసుకున్నప్పటి నుంచి మహిళల హక్కులకు విఘాతం ఏర్పడింది. తాలిబన్లు-సైన్యానికి మధ్య యుద్ధం సమయంలో స్కూళ్లు మూతపడ్డాయి. సుమారు నెల రోజుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయి. కానీ, అందరికీ కాదు. మిడిల్, హై స్కూల్ బాయ్స్‌కి మాత్రమే తెరిచిన పాఠశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి టీచర్లు, male స్టూడెంట్లు స్కూళ్లకు వెళ్తున్నారు.
కానీ, అమ్మాయిలకు కూడా స్కూల్స్‌కి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలువరు సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ అఫ్గాన్ బాలిక తనకు స్కూల్‌కి వెళ్లాలని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోను అఫ్గాన్ జర్నలిస్టు బిలాల్ సర్వరీ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
ఈ వీడియోలో ఆ బాలిక... నా దేశానికి ఏదైనా చేయడానికి ఇదే గొప్ప అవకాశం. పురుషులతో సమానంగా మహిళలకు అల్లా సమానంగా హక్కులు ఇచ్చాడు. కానీ, ఈ తాలిబన్లు ఎవరు మా హక్కులను మాకు దూరం చేయడానికి? అని ప్రశ్నించింది. ఈ రోజు గర్ల్స్... రేపు తల్లులు అవుతారు. వీరు చదువుకోకపోతే... తమ పిల్లలకు ఎలా అన్ని నేర్పుతారు. నేను తినడానికి, పడుకోవడానికి, ఇంట్లో ఉండటానికి పుట్టలేదు. నాకు స్కూల్‌కి వెళ్లాలని ఉంది. దేశ అభివృద్ధి కోసం ఏమైనా చేయాలని ఉంది. ఇలా ఉంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది. పౌరులు చదువుకోకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది. మేము ఇప్పుడు చదువుకోకపోతే.. మాకు ప్రపంచంలో విలువ అనేదే ఉండదు అని తన ఆవేదన అంతా వెళ్లగక్కింది.
Also Read: World Record: ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు. ‘ఎంతో ధైర్యం, నీ స్పీచ్‌తో ఆకట్టుకున్నావు. నువ్వు, నీ ఫ్యామిలీ సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.