యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్‌లో ఓ తల్లి తన మూడు రోజుల బిడ్డకు రెస్టారెంట్లో పాలు ఇస్తుంటే... ఆ రెస్టారెంట్ యజమాని ఆమెను బయటికి వెళ్లిపోమ్మని ఆదేశించాడు. పసి బిడ్డకు పాలిస్తుంటే ఇలా చేయడం కరెక్టు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇదంతా ఎక్కడ, ఎప్పుడు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.  


Also Read: Swiggy and Zomato: స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లిఫ్ట్స్ వాడొద్దు... మెట్లు ఎక్కి రండి... ఓ మాల్ ఆర్డర్... నెటిజన్ల ఆగ్రహం



అసలేం జరిగిందంటే... వాషింగ్టన్‌కి చెందిన రూబీ మీడన్ (25), తన భర్త అరోన్ (31) తో కలిసి గ్రీక్ ఐస్ లాండ్స్‌లో తమ సమీప బంధువులను కలిసేందుకు వెళ్లాడు. వీరితో పాటు ఈ దంపతులు మూడు రోజుల చిన్నారి రెట్ కూడా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ చిన్నారికి ఆకలి వేయడంతో ఏడవడం మొదలుపెట్టాడు. వెంనటే రూబీ తన చిన్నారికి అక్కడే రెస్టారెంట్లో పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది గమనించిన ఆ రెస్టారెంట్ యజమాని రూబీ దగ్గరికి వచ్చి... కోపంగా వెంటనే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోండి అని ఆర్డర్ వేశాడు. రూబీ ఎందుకు వెళ్లాలి? ఏమైంది అని ప్రశ్నించగా... అతడు కనీసం సమాధానం ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపలేదు. 



Also Read: Guinness World Record: ఈ అక్కాచెల్లెళ్లు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలు... గిన్నీస్ బుక్‌లో చోటు


అంతేకాదు, ఆ రెస్టారెంట్ ఓనర్... మీ చిన్నారికి పాలు ఇచ్చేందుకు మా రెస్టారెంట్‌కి రావొద్దు అంటూ ఘాటుగా మాట్లాడాడు. దీంతో రూబీ దంపతులు అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆన్‌లైన్లో సదరు రెస్టారెంట్ పై నెగెటివ్ కామెంట్ ఇవ్వాలని అనుకున్నారు. అరోన్ ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిందంతా తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కొంత మంది మహిళలు ఆ రెస్టారెంట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎందుకు వెళ్లిపొమ్మన్నారో కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలు ఇస్తున్న తల్లిని ఇలా వెళ్లిపొమ్మనడం తప్పని అన్నారు. 


Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు


Also Read: Shocking Video: ఛీ... ఈ ఫ్యాక్టరీలో రస్కులు ఎలా ప్యాక్ చేస్తున్నారో... చూడండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.