హాయిగా ఇంట్లో కూర్చుని కావల్సిన రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డరిస్తే డెలివరీ బాయ్స్ చక్కగా ఇంటికి తెచ్చి పెడతారు. అది ఎండైనా, వానైనా... డెలివరీ కాస్త లేటైతే ఎందుకు లేటైంది అని ప్రశ్నిస్తాం. గత ఏడాది కరోనా సమయంలో స్విగ్గీ, జొమాటో ద్వారా బయటికి వెళ్లలేని వాళ్లు అందులో ఆర్డర్లు చేసి హాయిగా ఇంటికి కావల్సివన్నీ తెప్పించుకున్నారు. అలాంటప్పుడు వారికి మనం ఎంతోకొంత గౌరవం ఇవ్వాలి. అంతేకానీ, అవమానించకూడదు.
Also Read: World Record: ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... గత శనివారం ఉదయ్‌పూర్‌లోని ఓ మాల్ యాజమాన్యం స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించొద్దు అంటూ నోటీసు అంటించింది. శోభన నయ్యర్ అనే జర్నలిస్టు, ట్విటర్ యూజర్ ఈ నోటీసును ఫొటో తీసి నెటిజన్లతో పంచుకున్నారు. గంటల్లోనే వైరల్ అయిన ఈ ఫొటోతో మాల్ యాజమాన్యం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంటే ఎందుకు అంత చిన్న చూపు, వారేం తప్పు చేశారు, బరువులు మోస్తూ వారు మెట్లు ఎలా ? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, డెలివరీ బాయ్స్‌కి ఎంతో మంది మద్దతు ప్రకటించారు. వెంటనే ఆ నోటీసు తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు
మరికొందరు మాత్రం మాల్ యాజమాన్యానికి సపోర్టు చేశారు. డెలీవరి బాయ్స్ పలు చోట్ల తిరిగి వస్తారు. లిఫ్ట్‌లో వారితో పాటు వచ్చే వారికి కరోనా సోకే ప్రమాదం. మాల్ యాజమాన్యం ఇలా చేయడంలో తప్పేమి లేదు అని ట్వీట్ చేశారు. ఇక్కడే కాదు దేశ వ్యాప్తంగా అపార్టుమెంట్లలోకి, లిఫ్ట్స్‌లో తెలియని వారు వస్తే మనం ఇప్పటికీ భయపడుతూనే ఉన్నాం కదా అని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Trans Kitchen: ఇది ట్రాన్స్ జెండర్ల కిచెన్... పిల్లలకు, పేషెంట్లకు ఆహారం ఉచితం