సాధారణంగా ఒక వ్యక్తి ఎన్ని సార్లు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు తీసుకోవచ్చు? ఎన్నిసార్లా అంటారేంటి... రెండు డోసులు అని రోజూ చదువుతూనే ఉన్నాం కదా. మళ్లీ అదేం అనుమానం అనుకుంటున్నారా?. కానీ. ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా 5 సార్లు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు తీసుకున్నాడు... అంతేకాదండోయ్ 6వ సారి తీసుకునేందుకు మరోసారి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. 


Also Read: World Record: ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు


అయ్య బాబోయ్... అదేంటి. అసలు ఆ వ్యక్తి ఎవరు. ఎందుకు అలా చేశాడు. అసలు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అని కదా మీ సందేహం. ఇంకెందుకు ఆలస్యం. ఇక చదివేయండి. ఉత్తరప్రదేశ్‌కి చెందిన 73 ఏళ్ల వ్యక్తి రాంపాల్ సింగ్ 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు సర్టిఫికెట్లో వచ్చింది. నిజానికి అతడు అన్ని డోసులు తీసుకోలేదు. కానీ, అతడు తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు మనకు వచ్చే సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేయించుకున్నాడు. అందులో అతడు ఏకంగా 5 డోసులు తీసుకున్నట్లు నమోదైంది. ఆరో డోసు కోసం అతడు డిసెంబరు 2021 - జనవరి 2022 మధ్య స్లాట్ బుక్ చేసుకున్నట్లు చూపించింది. దీంతో రాంపాల్ షాక్‌కు గురయ్యాడు.  


Also Read: Cadbury Dairy Milk Ad: క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌ కొత్త యాడ్ చూశారా? మార్పు గమనించారా?


దీని తర్వాత అసలు ఏం జరిగిందా అని చూస్తే... అది టెక్నికల్ ఎర్రర్‌గా తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి రాంపాల్ ఈ ఏడాది మార్చి 16న మొదటి డోసు, మే 8న రెండో డోసు తీసుకున్నాడు. కానీ, రాంపాల్ డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికెట్లో మార్చి 16న ఫస్ట్ డోస్, మే 8న రెండో డోస్, మే 15న  మూడో డోస్, సెప్టెంబరు 15న ఏకంగా రెండు డోసులు తీసుకున్నట్లు ఉంది. దీనిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేష్ మోహన్ స్పందించారు. ఓ వ్యక్తి రెండు కంటే ఎక్కువసార్లు తీసుకున్నట్లు సర్టిఫికెట్ వచ్చినట్లు చూసిన తొలి కేసు ఇదని ఆయన తెలిపారు. 


Also Read: Gold Modaks: వామ్మో... కేజీ మోదక్‌లు రూ.12వేలా... ఏంటి ఈ మోదక్‌ల స్పెషల్?


Also Read: Ganesh Chaturthi: IPS ఆఫీసర్ అవతారంలో గణేశ్... WELCOME చెప్పిన ముంబయి పోలీసులు