ఏంటి... కేజీ మోదక్‌ల కాస్ట్ రూ.12వేలా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను మీరు చదివింది నిజమే. సాధారణంగా కేజీ మోదక్‌ల విలువ సుమారు రూ.100 నుంచి రూ.200 ఉంటుంది. కానీ, ఇక్కడ రూ.12వేలు అంటున్నారు. ఏంటా అని షాకయ్యారా. రూ.12 వేలు పెట్టి కేజీ మోదక్‌లు కొనాలంటే దానికి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. 


Also Read: Ganesh Chaturthi: IPS ఆఫీసర్ అవతారంలో గణేశ్... WELCOME చెప్పిన ముంబయి పోలీసులు


ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? అదేంటంటే... ఈ మోదక్‌లకు కాస్త బంగారు పూత వేశారు. దీంతో ధర ఆకాశాన్నంటింది.  మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన స్వీట్ షాపు వ్యాపారి దీపక్ చౌదరి ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. గణేశ్ నవరాత్రి వేడుకల వేళ ఇలా కాస్త వెరైటీగా ప్రయత్నించినట్లు దీపక్ చెప్పాడు. ఇంత ధర పెట్టి ఎవరైనా కొంటున్నారా? అని అడిగితే... అలాంటి డౌట్ ఏమీ అక్కర్లేదు. వీటికి ఉండే క్రేజ్ వీటిదే. కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గోల్డ్ మోదక్‌లే కాదు... ఈ సారి మా దుకాణంలో 25కి పైగా భిన్న రకాల మోదక్‌లను కస్టమర్లకు అందించాం. వెండి పూత పూసిన మోదక్‌లు మనకి ఇక్కడ దర్శనమిచ్చాయి.