బిగ్ బాస్ ఎపిసోడ్ 13లో ఇంటి సభ్యులను RRR దోస్తీ సాంగ్‌తో మేల్కొలిపారు. అనంతరం లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్ బాస్ వారికి ‘బాల్ పట్టు.. లగ్జరీ బట్జెట్ కొట్టు’ పేరుతో టాస్క్ ఇచ్చాడు. బాల్స్ మీద ఏ పేరైతే ఉంటుందో ఆ వస్తువు మాత్రమే లభిస్తుందని బిగ్ బాస్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా గార్డెన్ ఏరియాలో పెట్టిన పైపు లైన్ నుంచి బాల్స్ వదిలాడు. ఈ సందర్భంగా సభ్యులు ఆ టాస్క్‌లో పాల్గొన్నారు.
ఇంటి సభ్యులను అనుకరించిన జస్సీ: ఇన్ని రోజూలు కూల్‌గా సెన్సటివ్‌గా కనిపించిన సన్నీ.. ఇంటి సభ్యులను అనుకరిస్తూ శ్వేతను కాసేపు నవ్వించాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ గురించి మాట్లాడుతూ.. ఎవరెవరు ఎలా స్పందిస్తారో అనుకరించి చూపించాడు. మరోవైపు విశ్వ, శ్రీరామ్‌లు.. మానస్ గురించి మాట్లాడుకున్నారు. అతడిలో స్పోర్టివ్ స్పిరిట్, మెచ్యూరిటీ లేదని వ్యాఖ్యానించారు. అతడు ఓటమిని తీసుకోలేడని, గెలిచినవారిని చూసి ఫీలవుతాడని విశ్వ పేర్కొన్నాడు. మొదట్లో తనకు బాగా నచ్చడాని, అందుకే అతడి బ్యాండ్ ఇచ్చానని తెలిపాడు. కానీ, ఇప్పుడు చాలా మారిపోయాడని పేర్కొన్నాడు.
హమీదా ట్రయాంగిల్ లవ్‌పై లేడీస్ పంచాయితీ: ఇంట్లో లేడీస్ అంతా ఒక చోట చేరి.. కబుర్లు చెప్పుకున్నారు. హమీదా, యానీ మాస్టర్, ఉమాదేవీ, కాజల్‌లు.. సన్నీ, శ్రీరామ్ గురించి మాట్లాడుకున్నారు. హమీదాకు సన్నీ లైన్ వేస్తున్నాడని యాని మాస్టర్ తెలిపింది. మొదటి నుంచి అతడికి హమీద మీద క్రష్ ఉందని యానీ చెప్పగా.. తమది కేవలం దోస్తీ మాత్రమేనని హమీద పేర్కొంది. ఉమాదేవి మాత్రం.. కొద్ది రోజులు శ్రీరామ్‌తోనే ఉండు, ఆ తర్వాత పోరా అని చెప్పు అని హమీదకు చెప్పింది. శ్రీరామ్‌కు హమీద మీద క్రష్ ఉందని కాజల్ కన్ఫర్మ్ చేసింది. యానీ మాస్టర్ కూడా అది నిజమేనని చెబుతూ.. ‘‘మొన్న రెడీ అవుతుంటే ఇలా చూస్తున్నాడు’’ అని పేర్కొంది. ఆ తర్వాత వారంతా సన్నీని ఓ ఆట ఆడుకున్నారు. హమీదా మీద నీ ఫీలింగ్ ఏమిటని కాజల్ అడిగింది. ఈ సందర్భంగా సన్నీ ‘హమీదా దోస్త్ ఫర్ ఎవర్’ అని చెప్పాడు.
ఈ వారం బెస్ట్, వరెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు?: ఈ వారం మొత్తం బెస్ట్ పెర్ఫార్మర్, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. ఈ సందర్భంగా హమీద, విశ్వ.. షణ్ముఖ్‌ను, శ్రీరామ్, మానస్, లోబో, రవి, సన్నీ.. నటరాజ్ మాస్టర్‌ను, లహరీ.. మాసన్‌ను, ప్రియా, సిరి, ప్రియాంక, నటరాజ్.. శ్రీరామ్, షణ్మఖ్.. మానస్, ఉమా, శ్వేత.. జస్సీను బెస్ట్ పెర్ఫార్మర్‌గా పేర్లు చెప్పారు. చివరికి నటరాజ్ బెస్ట్ పెర్ఫార్మర్‌గా ఎంపిక చేశారు. వరస్ట్ పెర్ఫార్మర్‌గా.. విశ్వ.. ప్రియాంక, రవి, ఉమాదేవి, షణ్ముఖ్, కాజల్, ప్రియా,.. సన్నీని, శ్వేత.. సిరిని, మానస్.. శ్రీరామ్‌ను, యానీ మాస్టర్ ఉమాను, శ్రీరామ్.. రవిని ఎంచుకున్నారు. చివరికి సన్నీని వరెస్ట్ పెర్ఫార్మర్‌గా ఎంపిక చేశారు. దీంతో బిగ్ బాస్ సన్నీని జైల్లో పెట్టాలని ఆదేశించాడు.
కాజల్ ప్రియా మధ్య ‘కిచెన్’ గొడవ: కిచెన్‌లో వర్క్ కోసం కాజల్, ప్రియా మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రియా కెప్టెన్‌గా ఎంపిక కాకూడదని హమీద తీసుకున్న నిర్ణయంతో.. కాజల్ కిచెన్ గొడవను లింకు పెట్టింది. కిచెన్‌లో పనిచేయమని చెబుతూ.. తన వీక్ పాయింట్ మీద కొడుతున్నారని కాజల్ ప్రియాతో వ్యాఖ్యానించింది. తనతో గిన్నెలు తోమిస్తున్నారని కాజల్ తన బాధను వ్యక్తం చేసింది. కాజల్ వెంటనే మాట మార్చేస్తోందని, అబద్దాలు చాలా సులభంగా చెప్పేస్తోందని ప్రియా తెలిపింది. అబద్దం కాడు చాలా నిక్కచ్చిగా చెబుతావ్ అని పేర్కొంది. ఆ తర్వాత రవి.. కాజల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. చివరికి ప్రియా వచ్చి కాజల్‌కు సారీ చెప్పడంతో ఆ గొడవ అక్కడితే ఆగింది.
బిబి న్యూస్‌తో మనసులో మాటలు..: బిబి న్యూస్ పేరుతో కాజల్, రవి రిపోర్టర్ అవతారం ఎత్తారు. మీకు పెళ్లం లేనట్లయితే మీరు ఇంట్లో ఎవరికి లైనేస్తారనే ప్రశ్నకు వెంటనే రవి.. కాజల్‌కు పేరు చెప్పాడు. దీంతో కాసేపు కాజల్ షాకైంది. అరేహో అని నవ్వుకుంది. ఆ తర్వాత యానీ, స్వేత మధ్య తల్లికూతుళ్ల బంధం గురించి ప్రశ్నలు వేశారు. హమీదా, సన్నీ, శ్రీరామ్‌ది ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని యానీ మాస్టర్ చెప్పింది. ఆ తర్వాత లోబోను ఇంటర్వ్యూ చేశారు. రవి ఎందుకింత ఇష్టమని అడిగాడు రవి, ప్రతి రోజు ఎందుకు నామినేట్ చేస్తున్నావ్.. అని కాజల్ కూడా ప్రశ్నించింది. తాను ఉన్నది చెప్పి నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ‘‘ఉమాను బాత్రూమ్‌లో చూసి మనసు పడ్డాను. ఐ లవ్ యు పొట్టి అని చెబితే యాక్సెస్ చేసింది. మానస్-ప్రియాంక జోడీ బాగుంటుందని లోబో’’ చెప్పాడు. ఆ తర్వాత నటరాజ్, ప్రియాలను ఇంటర్వ్యూ చేశారు.
ప్రియాపై మనసు లాగుతోంది.. శ్రీరామ్: ఈ ఫన్నీ ఇంటర్వ్యూలో భాగంగా రవి.. శ్రీరామ్ వద్దకు వెళ్లి.. మీరు సిరి, హమీద, లహరీ చుట్టు తిరుగుతున్నారని రూమర్స్ వస్తున్నాయని అడిగాడు. ఇందుకు సమాధానమిస్తూ.. ఫస్ట్ వీక్‌లో అలా ఉండేది. ఇప్పుడు మనసు ప్రియా వైపు లాగుతోందన్నాడు. ఆమె ఎప్పుడు తయారై వచ్చినా బార్బి డాల్‌లా కనిపిస్తారని ఆమె ఎదురుగానే చెప్పేశాడు. భార్య ఎలా ఉండాలనే విషయం మీద తనకు క్లారిటీ లేదని, లహరీ, ప్రియాలు వైఫ్ మెటీరియల్ అని పేర్కొన్నాడు. గర్ల్‌ఫ్రెండ్‌గా సిరి లేదా హమీదాను, బెస్ట్ ఫ్రెండ్‌గా శ్వేతాను సెలక్ట్ చేసుకుంటానని చెప్పాడు. అయితే, పనిమనిషిగా కాజల్‌ను ఎంపిక చేసుకుంటామని చెప్పడంతో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత మానస్.. లహరీ భార్యగా ఉంటే బాగుంటుందంటూ తన మనసులో మాట చెప్పేశాడు. మరదలుగా ప్రియాంక, గర్ల్‌ఫ్రెండ్‌గా హమీదాను సెలక్ట్ చేసుకుంటానని తెలిపాడు. హమీదాను శ్రీరామ చంద్ర, సన్నీలో ఎవరిని సెలక్ట్ చేసుకుంటావంటే.. శ్రీరామ్ చంద్ర అని చెప్పాడు. పాటల వల్ల అతడు నచ్చాడని చెప్పింది. తమ మధ్య ఇంకా బాండ్ ఏర్పడాలంటూ తెలివిగా మాట్లాడింది. సన్నీ మాట్లాడుతూ.. శ్వేత వైఫ్, హమీద గర్ల్‌ఫ్రెండ్, సిరిని పనిమనిషిగా ఎంపిక చేసుకుంటానని చెప్పాడు. జస్సీ మాట్లాడుతూ.. శ్వేత వైఫ్ అని చెప్పాడు. గర్ల్‌ఫ్రెండ్‌గా సిరి, పనిమనిషిగా.. కాజల్‌ను ఎంపిక చేసుకుంటానని చెప్పాడు. చివరిగా.. హమీద శ్రీరామ మనోహరా.. పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. మొత్తానికి తమ కెమిస్ట్రీతో బిగ్ బాస్‌కు కావల్సిన కంటెంట్ ఇచ్చేశారు.