1913లో జన్మించిన ఓ కవలల జంట తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.  జపాన్‌కు చెందిన ఈ కవలల జంట 107 సంవత్సరాలు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన కవల అక్కాచెల్లెళ్లుగా వీరు గిన్నిస్‌ రికార్డులకెక్కారు. వీరి పేర్లు ఉమెనొ సుమియామ, కౌమె కొడమ. సోమవారం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ కవలల వియస్సు 107 ఏళ్ల 330 రోజులని తెలిపారు. ప్రపంచంలో జీవించి ఉన్న కవలల్లో అత్యంత వృద్ధ అక్కాచెల్లెళ్లు అని వారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జపాన్‌కే చెందిన కిన్‌ నరిటా, జిన్‌ కానీ అనే కవలల పేరిట ఈ రికార్డు ఉంది. వీరి వయస్సు107 ఏళ్ల 75 రోజులు. ఈ రికార్డును ఉమోనొ, కొడమ బద్దలు కొట్టారు. 


Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు


జపాన్‌లోని షొడొషిమా దీవిలో 1913 నవంబర్‌ 5వ తేదీన జన్మించిన వీరు జన్మించారు. కానీ, వీరిని విధి వేరు చేసింది. సుమారు 70 ఏళ్లు వచ్చే వరకు వీరు వేర్వేరు చోట్ల జీవనం సాగించారు. తర్వాత కలుసుకున్న వీరిద్దరూ తీర్థయాత్రలు చేస్తూ 88 షికోకు ఆలయాలను సందర్శించారు. ఎక్కువ రోజులు జీవించి, గత రికార్డులను బద్దలు కొట్టడంపై వీరు మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటారని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. హాస్యచతురత, పెద్దరికం వీరిని 1990ల నుంచి పెద్ద సెలబ్రిటీలుగా మార్చేసింది.


Also Read: World Record: ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు


అందరూ వీరిని కిన్‌–సన్, జిన్‌–సన్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు చోట్ల ఆరోగ్య కేంద్రాల్లో ఉంటున్నారు. వీరి ఘనతను ప్రశంసిస్తూ గిన్నీస్‌ సంస్థ కొత్త రికార్డు సర్టిఫికెట్లను సోమవారం పంపించింది. ఆ రోజే ఎందుకంటే సోమవారం జపాన్‘రెస్పెక్ట్‌ ఫర్‌ ది ఏజ్‌డ్‌ డే’జరుపుకుంది. జపాన్‌లో ఆ రోజు జాతీయ సెలవు దినం కూడా. జపాన్‌ 12.5 కోట్ల జనాభాలో 29% మంది 65 ఏళ్లు, ఆపైని వారే. 


Also Read: Pet to Travel in Style: పెంపుడు కుక్క కోసం బిజినెస్ క్లాస్ మొత్తాన్ని బుక్ చేశాడు... రూ.2.5లక్షలు ఖర్చు చేశాడు


Also Read: Gold Modaks: వామ్మో... కేజీ మోదక్‌లు రూ.12వేలా... ఏంటి ఈ మోదక్‌ల స్పెషల్?


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.