వారం రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. వాతావరణ చల్లబడిపోయింది. ఇలాంటి సమయంలోనే జలుబు, దగ్గు, జ్వరాలు వంటివి దాడిచేస్తుంటాయి. ఎప్పుడు వాన పడుతుందో తెలియని పరిస్థితిలో.. ఆఫీసులకో, దుకాణాలకో వెళ్లి వానలో తడవడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చు. అసలు కరోనా కాలం ఏ జలుబు, దగ్గో వస్తే అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త ఉండడం అవసరం. 


వానలో తడిచి ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేయాలంటే...?


1. ఇంటికి వచ్చిన వెంటనే తడిచిన బట్టలు విప్పి, వెచ్చని బట్టలు వేసుకోండి. దీని వల్ల శరీరం టెంపరేచర్ సాధారణ స్థాయికి  త్వరగా చేరుకుంటుంది. ఎక్కవ సమయం తడిచిన బట్టల్లో ఉంటే శరీర ఉష్ణోగ్రత పడిపోవడం మొదలవుతుంది. 
2. డ్రెస్ మార్చుకున్నాక యాంటీ బ్యాక్టిరియల్ క్రీమ్ ని శరీరమంతా రాసుకోండి. దీని వల్ల వాన నీటి వల్ల కలిగే దురదలు, అలెర్జీలకు దూరంగా ఉండొచ్చు. 
3. వేడి వేడి టీ లేదా కాఫీ, ఏదైనా కేవలం వేడిగా ఉన్నది మాత్రమే తాగండి. చల్లని వాతావరణంలో వేడి పానీయాలు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తాయి. 
4. చాలా మంది వాన పడుతున్నప్పుడు పకోడీలు, బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తినేందుకు ఇష్టపడతారు. కానీ వానలో తడిచిన వెళ్లాక ఇలాంటివి తినేందకు సిద్ధం కాకండి. మీ శరీరమంతా వాననీటికి చల్లబడిపోయి ఉంటుంది. వెంటనే ఇలాంటి ఆహారం తినడం వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంటుంది. 
5. వానలో ఎక్కువ సేపు తడిశాక శరీరం ఉష్ణోగ్రత తగ్గిందనిపిస్తే కాసేపు వ్యాయామం చేయండి. దీని వల్ల చలికి బిగుసుకున్న కండరాలు సాధారణ స్థితికి వస్తాయి. అలాగే శరీర ఉష్ణోగ్రత నార్మల్ గా మారుతుంది. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.  


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను బట్టి కథనాన్ని అందించాం. మీ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడును సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also Read: అలాంటి తల్లులకు శుభవార్త.. వారి పాలల్లో పది నెలల పాటూ యాంటీ బాడీలు, బిడ్డలకు రక్ష


Also read: ఈ ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారచ్చు... జాగ్రత్త పడండి


Also read: ఆ ఊళ్లో చెట్ల నిండా నాణాలే... ఎవరైనా దొంగిలిస్తే కష్టాలే