ఐపీఎల్‌లో నేడు సాయంత్రం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అబుదాబిలో ఈ మ్యాచ్ జరగనుంది. యూఏఈలో మ్యాచ్‌లు మొదలయ్యాక ముంబైకి అస్సలు కలిసిరాలేదు. మూడు మ్యాచ్‌లు ఆడితే.. అన్నీ ఓడిపోయింది. ఇక పంజాబ్ తన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్. టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సిందే.
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు జరగగా, 14 మ్యాచ్‌ల్లో ముంబై, 13 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలిచాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే రికార్డు సమం అవుతుంది.
ముంబై ఇండియన్స్‌కు యూఏఈలో ఇంతవరకు ఒక్క అంశం కూడా కలసిరాలేదు. జట్టు మిడిలార్డర్ తీవ్రంగా నిరాశ పరుస్తోంది. అంత బలమైన బౌలింగ్ లైనప్ కాని బెంగళూరు చేతిలోనే ముంబై 111 పరుగులకు ఆలౌట్ అవ్వడం మింగుడు పడని అంశం. జట్టు నిండా స్టార్లే ఉన్నా ఇంతవరకు ఎవరూ అంత మెరుగ్గా ఆడలేదు. కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినా.. భారీ స్కోరును చేసే సామర్థ్యం ముంబైకి ఉంది. కానీ అలా ఆడేవారే కరువయ్యారు.
Also Read: షాకిచ్చిన మొయిన్ అలీ! టెస్టులకు గుడ్‌బై.. మూడో బెస్ట్ బౌలర్ అతడే!
ఇక పంజాబ్‌ది మరో కథ.. కేఎల్ రాహుల్ మినహా ఎవరూ సరిగా ఆడటం లేదు. మయాంక్ అగర్వాల్, గేల్, పూరన్, మార్క్రమ్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ భారీ స్కోర్లు చేయడం ఇబ్బంది పడుతోంది. అయితే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించారు కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా అదే జట్టు కొనసాగే అవకాశం ఉంది. ఈ రెండు జట్లలో ఎవరు గెలిచి టోర్నీలో ముందడుగు వేస్తారో చూద్దాం...
తుది జట్లు(అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడం మిల్నే, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, గేల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రార్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్
Also Read: హర్షల్ పటేల్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించిన ఆర్సీబీ బౌలర్