రాజస్థాన్‌ రాయల్స్‌ సారథి సంజు శాంసన్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో 3000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన 19వ ఆటగాడిగా అవతరించాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ 2021లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. దిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ నుంచి ఆరెంజ్‌  క్యాప్‌ అందుకున్నాడు.


Also Read: ఢిల్లీతో కోల్‌కతా ఢీ.. నైట్‌రైడర్స్‌కు కీలకం!


3వేల మైలురాయి
రాజస్థాన్‌ రాయల్స్‌ సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కష్టాల్లో పడ్డ ఆ జట్టును సంజు శాంసన్‌ ఆదుకున్నాడు. కేవలం 57 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఏడు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదేశాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌లో మూడువేల పరుగుల ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే ఛేదనలో హైదరాబాద్‌ అదరగొట్టింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (60), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (51) రాణించడంతో మరో తొమ్మిది బంతులు మిగిలుండగానే మూడు వికెట్ల తేడాతో విజయం అందుకుంది.


Also Read: ఎట్టకేలకు ఒక్క విజయం.. రాజస్తాన్‌పై ఏడు వికెట్లతో రైజర్స్ విన్!


117 మ్యాచుల్లో
శాంసన్‌ మూడువేల పరుగులను చేరుకొనేందుకు 117 మ్యాచులు ఆడాడు. 29.87  సగటుతో రాణించాడు. పంజాబ్‌ కింగ్స్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ ఈ మధ్యే 3000 మైలురాయి అందుకున్నాడు. ఇందుకోసం అతడు కేవలం 90 మ్యాచులు, 81 ఇన్నింగ్స్‌లే తీసుకోవడం ప్రత్యేకం. కాగా ఐపీఎల్‌ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్‌ కోహ్లీ (6185), శిఖర్ ధావన్‌ (5627), రోహిత్‌ శర్మ (5556), సురేశ్‌ రైనా (5523), డేవిడ్‌ వార్నర్‌ (5449) టాప్‌-5లో ఉన్నారు.


Also Read: ఇదేందయ్యా ఇదీ! కోహ్లీ, రోహిత్‌ బ్రొమాన్స్.. ఆశ్చర్యపోయిన అభిమానులు.. చిత్రాలు వైరల్‌!


ఈ సీజన్లో టాప్‌
సన్‌రైజర్స్‌ మ్యాచులో అర్ధశతకం చేసిన సంజు ఈ సీజన్లో టాప్‌ స్కోరర్‌గా మారాడు. పది మ్యాచుల్లో 54.12 సగటు, 141.96 స్ట్రైక్‌రేట్‌తో 433 పరుగులు చేశాడు. దిల్లీ ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ 10 మ్యాచుల్లో 47.77 సగటు, 131 స్ట్రైక్‌రేట్‌తో 430 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం ఆరెంజ్‌ క్యాప్‌ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాడు. అతడు 9 మ్యాచుల్లోనే 57.28 సగటు, 135.01 స్ట్రైక్‌రేట్‌తో 401 పరుగులు చేశాడు. డుప్లెసిస్‌ (394), రుతురాజ్‌ గైక్వాడ్‌ (362) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి