భారత క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రెండు కళ్లు! తమ ఆటతీరుతో టీమ్‌ఇండియాకు వారిద్దరూ ఎన్నో అపూర్వ విజయాలు అందించారు. వీలైన ప్రతిసారీ జట్టును గెలిపించారు. కానీ వారి మధ్య విభేదాలు ఉన్నాయని, డ్రెస్సింగ్‌ రూమ్‌లో సరిగ్గా మాట్లాడుకోరని ఎప్పట్నుంచో వినికిడి!


Also Read: ప్లేఆఫ్ కోసం రాజస్తాన్.. పరువు కోసం హైదరాబాద్!


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ఆదివారం నాటి మ్యాచులో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య బ్రొమాన్స్‌ చూస్తే మాత్రం అస్సలు అలా అనిపించలేదు. వారిద్దరూ ఎంతో ఆత్మీయంగా ఉన్నారనే అనిపిస్తోంది! నిజానికి వారిద్దరి బ్రొమాన్స్‌ అభిమానులను ఒకింత ఆశ్చర్యపరిచింది. కొందరైతే ఇదంతా నిజమేనా? అన్నట్టుగా ట్వీట్లు చేశారు. ప్రతిసారీ కోహ్లీ, మహీ మధ్య అలాంటి అనుబంధం కనిపించేదని, ఈ సారి రోహిత్‌, కోహ్లీ మధ్య కనిపించడం విస్మయ పరిచిందని అంటున్నారు.


Also Read: షాకిచ్చిన మొయిన్‌ అలీ! టెస్టులకు గుడ్‌బై.. మూడో బెస్ట్‌ బౌలర్‌ అతడే!


ఐపీఎల్‌లో ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డ సంగతి తెలిసిందే. లీగ్‌ రెండో అంచెలో ఈ రెండు జట్లు వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఈ జట్లు తలపడ్డాయి. మ్యాచ్‌ సాంతం ముంబయి, బెంగళూరు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చలాయించాయి.


Also Read: హర్షల్ పటేల్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించిన ఆర్సీబీ బౌలర్


మొదట  బ్యాటింగ్ చేసిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు  6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ముంబయికి 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఛేదనలో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు తడబాటుకు లోనయ్యారు. రోహిత్‌ (43), డికాక్‌ (24) ఉన్నంత వరకు బాగానే ఉన్న ముంబయి.. ఆర్సీబీ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ దెబ్బకు ఒక్కసారిగా డీలా పడిపోయింది. మరెవ్వరూ తొమ్మిదికి మించి పరుగులు చేయలేదు. దాంతో 54 పరుగుల తేడాతో కోహ్లీసేన ఘన విజయం అందుకుంది. అదే సమయంలో కోహ్లీ, రోహిత్‌ సన్నిహితంగా, సరదాగా గడపడంతో వారి చిత్రాలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి