అక్కినేని ఇంటి కోడలుగా సమంతా కొనసాగుతుందా? ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆప్ ది టౌన్ ఇదే. సామ్ - చై మధ్య ఏదో జరుగుతోందని అక్కినేని అభిమానులకు అర్థమైంది... కానీ క్లారిటీ మాత్రం రావడం లేదు. అందుకే సమంత ఏ పోస్టు పెట్టినా దాని అర్థాలను భూతద్దం పెట్టి మరీ వెతికేస్తున్నారు. మొన్నటి వరకు ఏవేవో కొటేషన్లు పెట్టిన సామ్ ఈ రోజు మాత్రం ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో తన స్నేహితులతో కలిసి జోరుగా సైకిలో మీద దూసుకెళ్తోంది సామ్. ఓ పక్క వర్షం పడుతున్నా అదరకుండా జాలీగా రైడ్ చేస్తోంది. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న సామ్ అక్కడే సైకిల్ రైడింగ్ లో పాల్గొంది. బెస్ట్ స్నేహితులతో వర్షంలో రైడింగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. మొదటిరోజు 21 కిలోమీటర్లు సైకిల్ తొక్కానని, వంద కిలోమీటర్లను చేరుకుంటానని ఇన్ స్టా స్టోరీస్ లో పోస్టు చేసింది.
గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా షూటింగ్ ను గత నెలలో పూర్తి చేసుకుంది సమంత. హైదరాబాద్ నుంచి చెన్నై చేరిన సామ్ అక్కడ ఒంటరిగా నివసిస్తున్నట్టు సమాచారం. తన స్నేహితులతో టూర్లు, పార్టీలు, సైకిల్ రైడ్లతో ఎంజాయ్ చేస్తోంది. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్లు కీర్తిసురేష్, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్ తో కలిసి వీకెండ్ పార్టీని సెలెబ్రేట్ చేసుకుంది సమంత. ఆ పార్టీలో గులాబీలతో హల్ చల్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత పదేళ్లుగా విరామం లేకుండా పనిచేస్తోంది సామ్. ఇప్పుడు మాత్రం కాస్త బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే శాకుంతల సినిమా తరువాత ఏ సినిమాకూ సైన్ చేయలేదని చెబుతోంది. ఆమె చేసిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా సూపర్ హిట్ కొట్టింది. అందులో సమంత, రాజి పాత్రలో బోల్డ్ గా నటించింది. ఆమె నటనకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. త్వరలో మరిన్ని వెబ్ సిరీస్ లో సామ్ కనిపించే అవకాశాలున్నట్టు సమాచారం.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: జిజాంటిక్ జిలేబి... ఒక్కటే కిలో తూగుతుంది, చూస్తే నోరూరిపోవడం ఖాయం
Also read: మహానటి అందం వెనుక రహస్యాలివే... మీరూ ఫాలో అయిపోండి
Also read: కుంభకర్ణుడి విలేజ్.. రోజుల పాటూ నిద్రపోయే గ్రామస్థులు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు