సోషల్ మీడియా వచ్చాక దూరం తగ్గిపోయింది.  ఏ ప్రాంతంలో జరిగినదైనా సామాజిక మాధ్యమాల ద్వారా ఇట్టే ఖండాంతరాలు దాటి వెళ్లిపోతోంది. ముఖ్యంగా కొత్త కొత్త ఆహారాలు, వెరైటీ వంటకాలైతే మరీ స్పీడుగా షేర్ అవుతున్నాయి. అందుకే ఫుడ్ బ్లాగింగ్ ట్రెండింగ్ గా మారింది. చాలా మంది యూట్యూబ్, ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు అమర్ సిరోహి. ఇండియాలోని అనేక ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ దొరికే వెరైటీ వంటకాలను పరిచయం చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఇండోర్ లో పర్యటించారు. అక్కడ కూడళ్లలో తిరుగుతూ అనేక రకాల ఆహార పదార్థాలు రుచి చూశారు. వాటిల్లో ఒకటి ఈ జిజాంటిక్ జిలేబి. 


మనకు తెలిసిన జిలేబి చిన్నవిగా, అరచేతిలో ఇమిడేంత ఉంటాయి. కానీ ఇండోర్లో ఒక్కో జిలేబి బరువు కిలో  తూగుతుంది. అంత బరువైనవి వేసి అమ్ముతున్నారక్కడ. అమర్ సిరోహి ఆ జిలేబీలపై వీడియో తీసి ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఇండోర్ లోని సరఫా బజార్ లో ఓ జిలేబీ బండి దగ్గర ఈ వీడియోను షూట్ చేశారు. జిలేబీ పిండిలో ఎలాంటి ఆర్టిఫిషియల్ రంగులు కలపకుండా ఎంత చక్కగా జిలేబి చేశారో మీరూ చూడండి. ఆ జిలేబి పెద్ద ప్లేటులోకి ముక్కలుగా చేసి, లిక్విడ్ కోవాను పైన చల్లి వినియోగదారులకు అందిస్తున్నారు. చూస్తేనే నోరూరిపోతుంది. అందుకేనేమో అమర్ పోస్టు చేసిన వీడియోను దాదాపు పదహారున్నర లక్షల మంది వీక్షించారు.  



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 


Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా... ఈ డ్రింకులకు దూరంగా ఉండండి


Also read: రోజుకో గ్లాసుడు రాగి జావ తాగండి.. వైద్యుడి వద్దకు వెళ్లే అవసరం తగ్గుతుంది


Also read: చర్మం మెరిసేందుకు విటమిన్ ఎ కావాల్సిందే... మీ ఆహారంలో విటమిన్ ఎ ఉందా?