కీర్తి సురేష్ కెరీర్ ‘మహానటి’కి ముందు, ఆ సినిమా తరువాత అన్నంతగా మారిపోయింది. సావిత్రి బయోపిక్ లో పరకాయ ప్రవేశం చేసిందా అని ఆశ్చర్యపోయేంతలా... సావిత్రిలా నటించింది కీర్తి. అప్పట్నించి ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడీమెకు అభిమానుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఆ అభిమానుల కోసమే తన బ్యూటీ సీక్రెట్స్ పంచుకుంటోంది కీర్తి. ఆమె బయటి మేకప్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వదు. అందుకే అంతర్గతంగా నీళ్లు, ఆహారం, ఆనందం... వల్ల  చర్మసౌందర్యాన్ని, మానసిక ఆనందాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. 


1. కీర్తి శరీరానికి సరిపోయేనన్ని నీళ్లు తాగుతుంది. రోజుకి కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా చూసుకుంటుంది. శరీరానికి సరిపడా నీళ్లు అందితేనే చర్మం తేమవంతంగా ఉంటుందని ఆమె అభిప్రాయం. 
2. రోజు వారీ పనుల్లో ‘CTM’ తప్పని సరిగా ఉంటుంది. అంటే ఆంగంలో క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. 
3. మనుసును, మెదడును ప్రశాంతంగా ఉంచుకునేందుకు కీర్తి రోజూ కాసేపు యోగా చేస్తుంది. మానసకి ప్రశాంతం చర్మం పై మెరుపులా మారుతుందని ఆమె నమ్మకం. 
4. రసాయనాలు కలిపిన ఏ బ్యూటీ ఉత్పత్తిని ఈమె ఉపయోగించదు. కేవలం సహజ పద్ధతిలో తయారుచేసిన ఉత్పత్తులకే మొదటి ప్రాధాన్యత. 
5. మేకప్ అనగానే మొదట అందరికీ గుర్తొచ్చేది ఫౌండేషన్. కానీ కీర్తి ఫౌండేషన్ వాడదు. అది చర్మరంధ్రాలను మూసేసి, మొటిమలవంటి సమస్యలకు కారణమవ్వచ్చని ఆమె అభిప్రాయం. దానికి బదులు బీబీ క్రీమ్ ను వాడుతుంది. 
6. అధికంగా మేకప్ వేసుకోవడానికి ఆమె వ్యతిరేకి. కేవలం చాలా మినిమల్ మేకప్ తోనే సినిమాల్లో నటిస్తోంది. 
7. రాత్రి పడుకోబోయే ముందు కచ్చితంగా ముఖాన్ని క్లెన్స్ చేసుకునే నిద్రపోతుంది. దీనివల్ల చర్మానికి తాజా గాలి అందుతుంది. 
8. అన్నింటికన్నా ముఖ్యంగా కీర్తి చాలా ఆనందంగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు ఎక్కువ. 


కాస్మోటిక్ వ్యాపారంలో కీర్తి...
కీర్తి సురేష్ ఈ మధ్యనే బ్యూటీ ఉత్పత్తుల వ్యాపారంలో అడుగు పెట్టింది. మిత్రులు శిల్పారెడ్డి, కాంతిదత్‌తో కలిసి భూమిత్ర బ్రాండ్‌ పేరుతో స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతోంది. ఇవి ప్రకృతి సిద్ధమైనవి, ఎలాంటి రసాయనాలను కలపడం లేదని చెబుతోంది కీర్తి.  ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’లో, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోలా శంకర్’లో సోదరి పాత్రలో నటిస్తోంది. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also read: ఉప్పు ఎక్కువ తింటున్నారా... అయితే మీ మెదడు ప్రమాదంలో పడినట్టే


Also read: జిజాంటిక్ జిలేబి... ఒక్కటే కిలో తూగుతుంది, చూస్తే నోరూరిపోవడం ఖాయం


Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా... ఈ డ్రింకులకు దూరంగా ఉండండి