ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 618 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 6గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,142కు  చేరింది. గత 24 గంటల్లో 1,178 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఇంటికి చేరారు. ఇప్పటి వరకు  19,89,391 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ లో ప్రకటించింది. సోమవారం విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం 12,482 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. వీటన్నింటితో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,47,459 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,81,32,713 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 






Also Read:Bharat Bandh: దేశవ్యాప్తంగా 'భారత్ బంద్' ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్


దేశంలో కోవిడ్ కేసులు


దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కొత్త కేసులు 30 వేల దిగువగా నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య కూడా 3 లక్షల దిగువకు చేరింది. ఆదివారం మృతుల సంఖ్య 300లోపు నమోదైంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నిన్న 11,65,006 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 26,041 మందికి  కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. కేరళలో 15,951, మహారాష్ట్రలో 3,206 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 29 వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసులు 3.36 కోట్లకు చేరాయి. రికవరీలు 3.29 కోట్లగా ఉన్నాయి. రికవరీ రేటు 97.78 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.


Also Read: దేశంలో వరుసగా మూడో రోజు 30 వేలకు దిగువనే కరోనా కేసులు


86 కోట్ల టీకాలు పంపిణీ
 
ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2.99 లక్షలుగా ఉంది. ఆదివారం 276 మంది మరణించారు. ఇప్పటి వరకు 4.47 లక్షల మంది కరోనాకు బలయ్యారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. నిన్న 38.18 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు దేశంలో 86 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.


Also Read: పవన్ వాఖ్యలతో టాలీవుడ్ పరేషాన్.. బడా, చోటా నిర్మాతలు తలోదారి.. సినీ పెద్దలు సేఫ్ గేమ్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి