ఐపీఎల్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇది 40వ మ్యాచ్. పాయింట్ల పట్టికలో రాజస్తాన్ ఏడో స్థానంలో, రైజర్స్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఎలాగైనా టోర్నీలో బౌన్స్ బ్యాక్ అవ్వాలని రాజస్తాన్ చూస్తుండగా.. గెలిచి పరుపు నిలుపుకోవాలనే తాపత్రయం సన్‌రైజర్స్‌ది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.


ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన సన్‌రైజర్స్ పూర్తిగా ఒత్తిడిలో ఉంది. ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం వీరి వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. కీలక ఆటగాళ్లు వార్నర్, విలియమ్సన్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలం అయ్యారు. రైజర్స్ బౌలింగ్ మాత్రం బలంగానే ఉంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌ను 125 పరుగులకే కట్టడి చేసినా.. బ్యాట్స్‌మెన్ ఆ మాత్రం స్కోరును కూడా ఛేజ్ చేయలేకపోయారు.


Also Read: రద్దయిన టెస్టు మళ్లీ జరిగే అవకాశం.. ఎప్పుడంటే?


మరోవైపు రాజస్తాన్ మాత్రం జట్టును పదేపదే మారుస్తూ ఇబ్బంది పడుతోంది. రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్ స్థానంలో ఎవిన్ లూయిస్, లియామ్ లివింగ్‌స్టోన్‌లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. క్రిస్ మోరిస్‌కు ఈ సారైనా ఆడే అవకాశం వస్తుందా.. లేకపోతే బెంచ్‌కు పరిమితం అవుతాడో చూడాలి. వీళ్ల బౌలింగ్ విభాగం బాగున్నా.. బ్యాటింగ్‌లోనే వీళ్లు కూడా స్ట్రగుల్ అవుతున్నారు.


ఈ రెండు జట్లూ గతంలో 14 సార్లు తలపడగా.. ఏడు సార్లు సన్‌రైజర్స్, ఏడు సార్లు రాజస్తాన్ విజయం సాధించాయి. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 55 పరుగుల తేడాతో రైజర్స్‌పై విజయం సాధించింది.


తుదిజట్లు(అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేసన్ రాయ్, వృద్దిమాన్ సాహా, మనీష్ పాండే, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్


రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, ఎవిన్ లూయిస్, సంజు శామ్సన్(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మహిపాల్ లోమ్‌రోర్, రాహుల్ టెవాటియా, శ్రేయాస్ గోపాల్, తబ్రెయిజ్ శంశి, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్


Also Read: కుర్రాళ్ల దూకుడు మంత్రం.. ధోనీ సేనపై ఏంటి కోల్‌కతా తంత్రం!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి