పాదయాత్రలో అక్క, చెల్లెమ్మల కష్టాలు చూసి వైఎస్ఆర్ ఆసరా పథకానికి రూపకల్పన చేశామని.. చెప్పినట్లుగా నిధులు విడుదల చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఒంగోలులో రెండో విడత ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుంచి పద్దెనిమిదో తేదీ వరకూ  " వైఎస్సార్‌ ఆసరా" ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు.  ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా  నాలుగు విడతల్లో రూ.25,517 కోట్లను అక్క చెల్లెమ్మలకు జమ చేస్తామన్నారు.




Also Read : బద్వేలులో త్రిముఖ పోటీ.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ !


చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. 2014లో చంద్రబాబు మాట నమ్మి డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. చంద్రబాబు బాబు హయాంలో పొదుపు సంఘాలు నిర్వీర్యమైపోయాయని మమండిపడ్డారు.  హయాలో సున్నావడ్డీ పథకం కూడా రద్దు చేస్తే తాము ప్రారంభించామన్నారు. భుత్వ సహకారంతో డ్వాక్రా సంఘాలు నిలబడగలిగాయి. పంచాయతీ నుంచి పరిషత్‌ ఎన్నికల వరకు ప్రభుత్వంపై చూపిన ఆదరణను జగన్ గుర్తు చేసుకున్నారు. అక్కచెల్లెమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వివిధ పథకాల కోసం ప్రజల ఖాతాల్లో జమ చేసిన నిధుల వివరాలను సభలో సీఎం వెల్లడించారు. 


Also Read : "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం !
 
అంతకు ముందు ఆసరా సభా వేదిక వద్ద పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం వేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.  వైఎస్సార్‌ ఆసరా పథకం రెండవ విడత మొత్తాన్ని ప్రభుత్వం నేడు డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేయడమే పథకం  ఉద్దేశం. గత ఏడాది తొలి విడత సొమ్ము జమ చేశారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ చేస్తున్నారు. రెండేళ్లలో పొదుపు సంఘాల అప్పునకు సంబంధించి రూ.12,758.28 కోట్లు మహిళలకు అంద చేసినట్లని సీఎం తెలిపారు. 






Also Read: జగన్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ ..ఎందాకైనా వెళ్తానన్న రఘురామ..!


కడప జిల్లా డ్వాక్రా మహిళలు  ఆసరా సొమ్ముల కోసం కొంత కాలం ఆగాల్సి ప్రస్తుతం అక్కడ బద్వేలు ఉపఎన్నిక జరుగుతున్నందున కోడ్ అమల్లో ఉంది. ఈ కారణంగా నవంబర్‌ 6 నుంచి 15 వరకు ఆసరా పథకం అమలు చేస్తారు. ఈ విషయాన్ని సీఎం జగన్ సభలో ప్రకటించారు. 


Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి