షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుండి ఆ కేసు చుట్టూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. అధికారిక సమాచారం ఏదో ఎవరికీ తెలియదు. కానీ వీడియోలు, ఫోటోలతో సహా బయటకు వచ్చిన కొన్ని వివరాలు మాత్రం ఆ కేసు చుట్టూ "ఏదో" జరుగుతోందన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి. ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన రోజున ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టాడు. అతను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి కాదని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆర్యన్ మిత్రుడు మర్చంట్‌ను అదుపులోకి తీసుకుని ఎస్కార్ట్‌గా వస్తున్న వ్యక్తి కూడా ఎన్‌సీబీ అధికారి కాదని తేలింది. దీంతో ఎన్సీపీ అధికారులపై కొత్త కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్న బృందంలో ప్రైవేటు డిటెక్టివ్, బీజేపీ నేత ! 


మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమిలో ఎన్సీపీకి చెందిన మంత్రి నవాబ్ మాలిక్ .. నార్కొటిక్ కంట్రోల్  బ్యూరోపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు క్రూయిజ్‌లో సోదాలు మొత్తం నాటకమని.. సోదాల్లో ఎన్‌సీబీ అధికారులతో పాటు బీజేపీ నేత ఒకరు పాల్గొన్నారని మంత్రి నవాబ్‌ మాలిక్‌ వీడియోలు బయట పెట్టారు.  అసలా నౌకలో డ్రగ్సే దొరకలేదని మాలిక్ ఆరోపించారు. మాలిక్ విడుదల చేసిన వీడియోలో ఆర్యన్‌ను ఎస్కార్ట్‌ చేస్తూ గోస్వామి అనే వ్యక్తి కనిపించారు. అతను ప్రైవేటు డిటెక్టివ్‌గా చెప్పుకుని మోసాలకు పాల్పడే వ్యక్తి అని అతని ఎందుకు ఎన్‌సీబీ బృందంలో ఉన్నాడని మాలిక్ ప్రశ్నించారు. అలాగే ఆర్యన్ మిత్రుడు అర్బాజ్‌ మర్చెంట్‌ను ఇద్దరు ఎస్కార్ట్‌ చేస్తూ కనిపించారు. వీరిలో ఒక వ్యక్తి బీజేపీ కార్యకర్త. వీరంతా ఎన్‌సీబీ అధికారులు కానప్పుడు రైడ్‌లో ఎందుకున్నారని మాలిక్ ప్రశ్నించారు.


Also Read : బాలికపై యువకుడు రేప్.. వీడియో తీసిన మరో వ్యక్తి, పిన్ని ఇంటికి తీసుకెళ్లి మరో అత్యాచారం


 తామే సమాచారం ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రైవేటు డిటెక్టివ్, బీజేపీ నేత !


క్రూయిజ్‌లో ఎన్‌సీబీ సోదాలు జరిపినప్పుడు తాను అక్కడే ఉన్నానని మనీశ్‌ భన్సాలీ అనే బీజేపీ నేత తెలిపారు. తాను బీజేపీనే అయినప్పటికీ పెద్ద స్థాయిలో పరిచయాలు లేవని చెప్పుకుంటున్నారు. అక్టోబర్‌ 1న డ్రగ్స్‌ పార్టీ గురించి తనకు సమాచారం వచ్చిందని దాన్ని ఎన్‌సీబీకి చెప్పానని ఆయన చెబుతున్నారు. సాక్షిగా ఉండటానికే తాను వారితో పాటు వెళ్లానని బీజేపీ నేత చెబుతున్నారు.  తాను దేశం కోసం పని చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రైవేటు డిటెక్టివ్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన అక్కడ ఎందుకు ఉన్నారో చెప్పలేదు.


Also Read: హైటెక్‌గా భారీ వ్యభిచార దందా.. 75 మందిని పెళ్లి చేసుకున్న యువకుడు.. నిజాలు తెలిసి అవాక్కైన పోలీసులు


వాళ్లిద్దర్నీ సాక్షులుగా చెబుతున్న ఎన్‌సీబీ ! 


ఆర్యన్‌తో పాటు మిత్రుల్ని అరెస్ట్ చేసిన సమయంలో ఉన్న ప్రైవేటు డిటెక్టివ్ గోస్వామి, బీజేపీ నేత మాలిక్‌లు సాక్షులని ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు.  వారిద్దరితో పాటు మరి కొంతమంది సాక్షులుగా అక్కడికి వచ్చారని అంటున్నారు. అయితే రెయిడ్ చేసేటప్పుడు సాక్షుల్ని ప్రత్యేకంగా తీసుకెళ్తారా.. అలాంటి సంప్రదాయం ఎప్పటి నుంచి ఉందన్న సందేహాలు సహజంగానే వస్తున్నాయి.


Also Read: ఆ ఫోటోకు టెంప్ట్ అయిన గుంటూరు యువకుడు.. రూ.1.20 కోట్లు హుష్‌కాకీ.. బాధితుడు లబోదిబో..


 డ్రగ్స్ ఎన్‌సీబీ అధికారులే పెట్టారని బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్న మర్చంట్ ! 


ఆర్యన్ తో పాటు అరెస్టయిన ఆర్బాజ్ మర్చంట్ బెయిల్ పిటిషన్‌లో ఎన్‌సీబీపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీసీటీవీ ఫుటేజీ మొత్తాన్ని పరిశీలిస్తే డ్రగ్స్ తీసుకొచ్చి పెట్టింది ఎన్‌సీబీ అధికారులేనని తేలుతుందని వాదిస్తున్నారు. అక్టోబర్‌ రెండో తేదీన ముంబై పోర్ట్‌ అంతర్జాతీయ టెర్మినల్‌ వద్ద ఉదయం 11.30 నుంచి రాత్రి 8.30 వరకు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని తెప్పించి, భద్రపరచాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. 


Also Read: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే మర్డర్.. అన్నంలో మత్తు మందు కలిపి ఆపై హత్య... చివరికేలా చిక్కిందంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి