సమాజం తీరు రోజు రోజుకి మారుతోంది. ఎన్నడూ ఊహించని దారుణాలు చూడాల్సి వస్తుంది. మహిళలపై దారుణాలు, వివాహేతర సంబంధాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వివాహిత భర్తను కాదని మరో వ్యక్తితో కొనసాగిస్తున్న సంబంధం భర్తకు తెలియటంతో ప్రియుడితో కలిసి భర్తనే హత్యచేసింది. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామంలో ఆ దారుణం చోటుచేసుకుంది.


అన్నంలో మత్తు మందు కలిపి


జోగులాంబ గద్వాల జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన రాజుకు కొనేళ్ల ఏళ్ల క్రితం మాధవితో పెళ్లి అయింది. అయితే వివాహానికి ముందే మాధవికి మక్తల్ మండలం కలవలదొడ్డి గ్రామానికి చెందిన మునేష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. వివాహం అయిన తర్వాత కూడా మాధవి మునేష్ తో సంబంధాన్ని కొనసాగించింది. భార్య వివాహేతర సంబంధం భర్త రాజుకు తెలిసింది. ఈ విషయమై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తన పద్ధతి మార్చుకోవాలని రాజు హెచ్చరించినా ఆమె వినలేదు. భర్త ఒత్తిడి పెరగటంతో అతన్ని అడ్డుతొలగించుకోవాలని మాధవి భావించింది. ఈ విషయాన్ని తన ప్రియుడు మునేష్‎కు చెప్పింది. ఇద్దరూ కలిసి రాజు హత్యకు ప్లాన్ వేశారు. అక్టోబర్ 2వ తేదీ రాత్రి రాజుకు భోజనంలో మత్తు ట్యాబ్లెట్లు కలిపి పెట్టారు.


Also Read: అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..


హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ


భర్త రాజు భోజనం చేసి మత్తులోకి జారుకోగానే మాధవి ప్రియుడికి ఫోన్ చేసింది. మునేష్ తన స్నేహితులైన కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్రలతో మాధవి ఇంటికి వచ్చారు. ఐదుగురు కలిసి రాజు మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం హత్యను ప్రమాదంగా చిత్రీకరించటానికి రాజు శవాన్ని పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద పడేసి వెళ్లిపోయారు. రాజు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేశారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు రాజు మృతిపై అనుమానంవ్యక్తం చేశారు. ముందు భార్య మాధవిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఆమె తనకు ఏమి తెలియదని పోలీసులను చెప్పింది. కానీ పోలీసులు తమ స్టైల్ లో విచారించగా అసలు విషయం బయటపడింది. భర్త రాజు తనను వేధింపులకు గురిచేశాడని అందుకే ప్రియుడి సాయంతో హత్య చేసినట్లు నిజం ఒప్పుకుంది.


Also Read: కేటీఆర్ బినామీనని నమ్మించాడు.. కోట్లు కొల్లగొట్టాడు ! జగిత్యాలలో మహా మోసగాడు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి