దసరా పండుగ సందర్భంగా ఏర్పడే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు ఉంటాయని.. ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు ఉంటాయని తేల్చి చెప్పారు. బస్సులు వెళ్లేటప్పుడు రద్దీగా ఉండడం.. వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి ఉండడం వల్ల.. నష్టం రాకుండా ఉండేందుకు ఇలా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ వివరించారు.






Also Read : నిధులపై కేంద్రం - రాష్ట్రం టగ్ ఆఫ్ వార్ ! పోలవరం కల సాకారం ఎప్పటికి ?


అయితే, రెగ్యులర్ బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండబోవని స్పష్టం చేశారు. త్వరలో అన్ని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమలు చేస్తామని వివరించారు. ప్రైవేటు బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతామని వివరించారు. ఇంకా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనా.. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. విలీనమైన అనంతరం కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. డీజిల్ ధరల పెరుగుదలతో సంస్థపై భారం పెరిగింది. నిర్వహణ వ్యయం తగ్గించేందుకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. సంస్థపై పడుతున్న భారం, నష్టాలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచన లేదు’’ అని వివరించారు.


Also Read :ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవైద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...


Also Read : పేదరికంతో వైద్య విద్య ఆపేసి కూరగాయల అమ్మకం ! కేటీఆర్‌కు తెలిసిన వెంటనే...


Also Read : హెటిరో డ్రగ్స్ కార్యాలయం, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ దాడులు


Also Read : "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?


Also Read : రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి