సామాన్యుడిపై మరోసారి భారం పడింది. కొంత కాలంగా పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు తాజాగా మరింతగా ఎగబాకాయి. ఇది సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా చేసింది. ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను మరోసారి పెంచాయి. 14.2 కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గత సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్ ధర రూ.75 పెరగడం గమనించదగ్గ విషయం. దీంతో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.900కు చేరింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చేశాయి. కమర్షియల్ ఎల్​పీజీ సిలిండర్ ధర ఇటీవలే రూ.43.50 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ధరలు శుక్రవారం నుంచే(అక్టోబర్​ 1) అమల్లోకి వచ్చాయి. ఫలితంగా 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,736కి చేరింది.


Also Read: రాకెట్‌లా దూసుకుపోయిన 'షిబా ఇను'.. 24 గంటల్లో 45 శాతం!


ఇప్పటికే పెట్రోల్ ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధర కొన్ని చోట్ల ఏకంగా రూ.110 రూపాయలను తాకింది. డీజిల్ ధర రూ.100 దాటింది. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు పెరుగుతుండటం వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలైన ఈ ధరలు పెరగడంతో వీటి ప్రభావం ఇతర వస్తువులపై పడుతోంది.


Also Read: అమెజాన్ హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ అయిపోయిందా.. డోంట్ వర్రీ.. మీకోసం మళ్లీ!


ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం.. ఢిల్లీలో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధర రూ.884.50 నుంచి 899.50కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో ఇండేన్ గ్యాస్ ధర రూ.937 నుంచి రూ.952కి పెరిగింది. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అక్టోబర్ 1వ తేదీన కూడా గ్యాస్ ధరలను సవరించాయి. కమర్షియల్ గ్యాస్ ఎల్పీజీ ధరలను పెంచింది. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధరలను పెంచడానికి రెండు కారణాలు చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. దీంతోపాటు అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ ధరలకు అనుగుణంగా గ్యాస్ రేటు పెరుగుతున్నట్టు చెబుతున్నారు.


Also Raed: మళ్లీ ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అన్నిచోట్లా ఇంతే.. తాజా ధరలు ఇవే..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి