అమెజాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై భారీ ఆఫర్లు అందించిన సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా ఒకసారి బ్యాంకు ఆఫర్‌ను ఉపయోగించుకుంటే అదే సేల్‌లో ఆ కార్డుపై మళ్లీ ఆఫర్ వర్తించదు. కానీ ఈ అమెజాన్ సేల్‌లో ఒకసారి ఆఫర్‌కు ఉపయోగించిన కార్డును మళ్లీ ఉపయోగించుకునే అవకాశం వచ్చింది.


అక్టోబర్ 5వ తేదీ నుంచి అమెజాన్ ఈ సేల్‌లో అందించే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆఫర్‌ను రీసెట్ చేసింది. ఈ సేల్‌లో ఇప్పటికే ఒకసారి తమ కార్డును ఉపయోగించిన వినియోగదారులకు మళ్లీ ఆ కార్డును ఉపయోగించే అవకాశం వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై 10 శాతం తగ్గింపును ఈ సేల్‌లో అందిస్తున్నారు. అయితే గతంలో ఒక కార్డుకు ఒక్కసారి మాత్రమే ఈ ఆఫర్‌ను అందుకునే అవకాశం ఉండేది. కానీ ఈ సేల్‌లో మాత్రం మళ్లీ కూడా ఈ ఆఫర్ లభించనుంది.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆఫర్‌ను ఉపయోగించుకున్న బ్యాంకు వినియోగదారులకు.. ఈ ఆఫర్ అక్టోబర్ 5వ తేదీ నుంచి మళ్లీ లభించనుంది. అంటే 10 శాతం డిస్కౌంట్‌ను మళ్లీ పొందవచ్చన్న మాట. ఇప్పటికీ ట్రాన్సాక్షన్ చేయని వారికి ఆ ఆఫర్ అప్లికబుల్ కానుంది.


ఉదాహరణకు.. అక్టోబర్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మీరు రూ.5,000కు పైగా షాపింగ్ చేస్తే.. దానిపై 10 శాతం క్యాష్ బ్యాక్(రూ.1,500) లభించనుంది. అయితే అక్టోబర్ 5వ తేదీన ఈ ఆఫర్ తిరిగి రీసెట్ కానుంది. అంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యలో మీరు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని ఉన్నప్పటికీ.. 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఈ ఆఫర్ మళ్లీ ఉపయోగించుకోవచ్చు.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని.. మళ్లీ షాపింగ్ చేయాలి అనుకునేవారి కోసమే కంపెనీ ఈ ఆఫర్‌ను అందించింది. దీంతో వినియోగదారులు మరో రూ.1,500 వరకు తగ్గింపును పొందవచ్చు.


డెల్ 14 (2021) i3-1125G4 2 ఇన్ 1 టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి


హెచ్‌పీ క్రోమ్ బుక్ థిన్ అండ్ లైట్ టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ 14a-na0002TU ల్యాప్‌టాప్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి


అవిటా ఎసెన్షియల్ NE14A2INC433-CR 14 అంగుళాల బిజినెస్ ల్యాప్‌టాప్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి